Shruti Haasan: శృతి హాసన్ పొలిటికల్ ఎంట్రీ? స్వయంగా క్లారిటీ ఇచ్చిన స్టార్ కిడ్!
హీరోయిన్ శృతి హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆమె స్పందించారు. మీడియా ఎదుట స్పష్టత ఇచ్చారు.
Shruti Haasan
శృతి హాసన్ ముక్కుసూటి మనిషి. అలాగే స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. తన లైఫ్ ఓపెన్ బుక్. కెరీర్ బిగినింగ్ లోనే శృంగార సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది. దీనిపై విమర్శలు తలెత్తినా ఆమె వెనక్కి తగ్గలేదు. తాజాగా శృతి హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ మక్కల్ ఇయక్కమ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసింది. ఈ క్రమంలో శృతి హాసన్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. త్వరలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
Shruti Haasan Photos
కోయంబత్తూర్ లో ఓ కార్యక్రమానికి హాజరైన శృతి హాసన్ కి ఈ ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన, ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. నా దృష్టి సినిమాల మీదే ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి కథలు ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో పని చేస్తాను. నేను తమిళ అమ్మాయి. ఎక్కువగా తమిళ చిత్రాలు చేస్తాను అన్నారు. దీనిపై ఆమె పొలిటికల్ ఎంట్రీ పుకార్లకు బ్రేక్ పడింది.
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ లో శృతి హీరోయిన్ గా నటిస్తుంది. శృతికి సలార్ చిత్ర విజయం చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. డిసెంబర్ 22 కొత్త విడుదల తేదీగా ప్రకటించారు. అప్పుడు కూడా అనుమానమే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా శృతి లవ్ ఎఫైర్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు.
గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. మరి శాంతనుతో అయినా ఆమె బంధం పెళ్లి వరకు వెళుతుందా? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.