కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్న సమంత, దీపావళి తరువాత ముహూర్తం, ఏం చేయబోతుందంటే...?
చాలా కాలంగా కామ్ గా ఉంది సమంత. ఎక్కడ ఉందో ఏం చేస్తోందో కూడా తెలియనీయకుండా అజ్ఞాతంలో గడిపింది. ఇక జెట్ స్పీడ్ తో దూసుకురాబోతోంది సామ్.. కొత్త జీవితం స్టార్ట్ చయబోతుందట.. ఈ దీపావళికి ముహూర్తం కూడా పెట్టుకుంటందట..? మరి సమంత ఏం చేయబోతోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సమంత. కెరీర్ బిగినింగ్ లోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. లాంగ్ లవ్ తరువాత చైతూను పెళ్ళాడింది సమంత. ఆతరువాత కొన్ని కారణాల వల్ల భర్తకు దూరం అయ్యింది . అంతేకాదు విడాకులు ఇచ్చేసి నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అంటూ సింగిల్ గా మిగిలిపోయింది సామ్.
ఇక విడాకుల తరువాత చాలా విమర్షలు ఎదుర్కుంది సమంత. చాలా మానసిక సంఘర్షనను ఫేస్ చేసింది. కోలుకోవడానికి చాలా టైమ్ కూడా పట్టింది. అయితే ఈలోపు సమంత కెరీర్ అయిపోయింది. ఆమె ఇక సినిమాలు చేయదు.. తప్పంతా సమంతదే అని అనుకున్న జనాలకు రివర్స్ లో షాక్ ఇస్తోంది సామ్.
ఎవరు ఊహించని విధంగా బౌన్స్ బ్యాక్ అవుతూ.. తన రూటు మార్చుకుని కొత్తదనం చూపిస్తూ.. వరుస సినిమాలు చేస్తూ.. ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్ కూడా పెంచుకుంటుంది సామ్. క్రేజీ క్రేజీ రోల్స్ పట్టేస్తూ స్టార్ హీరోయిన్ నుంచి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగిపోయింది. అటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది.
ఇక సమంత చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉంది సమంత. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంది. ఆమె రీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్లింది అంటున్నారు సన్నిహిత వర్గాలు. అసలు ఏం చేస్తోంది ఏమో తెలియదు కాని ఆమె నటించిన యశోద సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.
ఇక సమంత తన జీవితాన్ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతుందట. తన బిజినెస్ లు, సోషల్ మీడియా, సినిమాలు ఇలా అంతా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట. అంతా ఓ పద్దతి ప్రకారం జరిగేలా ఇప్పటికే పథకాలు కూడా వేసుకుందట. మరీ ముఖ్యంగా తనను విడాకుల విషయంలో విమర్షించేవారికి ఘాటు తగిలేలా ప్లాన్ చేసుకుందట.
అంతే కాదు ఫ్రెష్ లైఫ్ ను స్టార్ట్ చేయబోతున్న సామ్.. దీపావళి తరువాత ముహూర్తం ఫిక్స్ చేసుకుందట. ఇంక తన జీవితంలో అక్కినేని అనే ప్రభావం లేకుండా.. సోలోగా సింగిల్ గానే జీవితాన్ని లీడ్ చేయాలని డిసైడ్ అయ్యిందట సమంత. సాధ్యమైనంత వరకూ క్రేజ్ ను పెంచుకుని తాను కూడా స్టార్ గా వెలుగు వెలగాలని చూస్తుందట సమంత.
ఇక సమంత గురించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది.. అక్కినేని ఫ్యామిలీ నుండి తాను ఎందుకు దూరం అయ్యింది..? దానికి గల కారణాలు ఏంటీ..? తనను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు..? ఇలా ప్రతీ విషయంలో ఆమె క్లారిటీ ఇస్తుందని సమాచారం. తనను ట్రోల్ చేసే జనాలకు అసలు విషయం క్లియర్ గా చెప్పే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ పనులను కూడా పూర్తి చేసుకుంటుందట సమంత.
నవంబర్ 11న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది యశోద మూవీ. కాగా ఇన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత త్వరలోనే సినీ ప్రమోషన్స్ లో జాయిన్ కాబోతుంది. ప్రమోషన్ లో కూడా తన పందా మార్చబోతున్నట్టు తెలస్తోంది. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా.. తన బిజినెస్ లైఫ్ ను కూడా పరుగులు పెట్టించబోతుంది సమంత. మరి ఆమె న్యూ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ విషయంపై సమంత ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి.