ఆటం బాంబులా పేలిన రష్మిక అందాలు... తన ప్రమేయం లేకుండా తీసిన ప్రైవేట్ ఫోటో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందాన బోల్డ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోను రష్మిక స్వయంగా తన ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే తన ప్రమేయం లేకుండా తీసిన ఫోటో అంటూ కామెంట్ చేసింది.
Rashmika Mandanna
స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో ఉన్న రష్మిక మందాన హాట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బోల్డ్ లుక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రష్మీ... ''ఇది సరిగ్గా ఏడాది క్రితం తీసిన ఫోటో. ఆమె ప్రమేయం లేకుండా మా టీమ్ క్లిక్ చేశారు. అలాగే చనువు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాము'' అని కామెంట్ చేసింది.
Rashmika Mandanna
మరోవైపు రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ విడుదల సిద్ధమైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది.
ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో రష్మిక నటించింది. ఇటీవల విడుదలైన సాంగ్ పరిమితికి మించిన రొమాన్స్ తో కూడి ఉంది. ముద్దు సన్నివేశాల్లో అభ్యంతరం లేకుండా నటించేందుకు రష్మిక రూ. 20 లక్షలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసిందంటూ ప్రచారం జరుగుతుంది.
నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక ఓ మూవీ ప్రకటించింది. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకీ కుడుముల రష్మిక ఫేవరెట్ డైరెక్టర్. ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. ఛలో మూవీతో రష్మిక బోణీ అదిరిపోగా స్టార్ హీరోయిన్ గా అవతరించింది.
అలాగే రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ. దేవ్ మోహన్ రష్మికకు జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా అంటున్నారు. ఆల్రెడీ రైన్ బో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక రష్మిక ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ ల చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 హిందీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు నిదర్శనం. దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తుంన్నారు.పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.