Raashi Khanna: ఆ హీరో అంటే నాకు పిచ్చి... బాలయ్య షోలో ఓపెన్ గా చెప్పేసిన రాశి ఖన్నా
ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా బోల్డ్ కామెంట్ చేసింది. ఆ హీరో అంటే క్రష్ అంటూ మనసులో కోరిక బయటపెట్టింది. బాలయ్య షోలో రాశి కామెంట్ వైరల్ అవుతుంది.
Raashi Khanna
అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా సీనియర్ హీరోయిన్స్ జయసుధ, జయప్రద హాజరయ్యారు. వీరితో ఈ తరం యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా జాయిన్ అయ్యారు. టు జనరేషన్స్ హీరోయిన్స్ తో బాలయ్య(Balakrishna) సరదా సంభాషణ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేశాయి. అలాగే పరిశ్రమలో హీరోయిన్స్ ఫేస్ చేసే ఆరోపణలు, ఇబ్బందులను కూడా బాలయ్య చర్చకు తెచ్చాడు.
Raashi Khanna
కాగా హీరోయిన్ రాశి ఖన్నాను ఆయన ఒక క్రేజీ ప్రశ్న అడిగారు. నువ్వు జతకట్టిన హీరోలలో నీ క్రష్ ఎవరో చెప్పమని అడిగారు. ఆ ప్రశ్నకు రాశి తడుముకోకుండా... విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అని చెప్పింది. చాలా మంది యంగ్ హీరోయిన్స్ తమకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని చెబుతున్నారు. ఈ లిస్ట్ లో రాశి ఖన్నా కూడా చేరింది.
Raashi Khanna
కాగా రాశి ఖన్నా(Raashi Khanna) కెరీర్లో వరల్డ్ ఫేమస్ లవర్ బోల్డ్ మూవీగా నిలిచిపోయింది. ఒక ఛాలెంజింగ్ రోల్ చేసిన రాశి ఖన్నా హీరో విజయ్ దేవరకొండతో శృంగార సన్నివేశాల్లో నటించారు. వీరి బెడ్ రూమ్ సీన్స్ కొంచెం పచ్చిగా ఉంటాయి. ఆ సినిమా పరాజయం పొందగా... రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నా క్రష్ అని చెప్పడం విశేషంగా మారింది. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ అనంతరం ఏడాది పాటు రాశి టాలీవుడ్ కి దూరం అయ్యారు. ఆ సమయంలో వరుసగా కోలీవుడ్ చిత్రాలు చేశారు.
Raashi Khanna
ఇక కార్తీకి జంటగా రాశి ఖన్నా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ సర్దార్ రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్దార్ బ్రేక్ ఈవెంట్ దాటి లాభాలు పంచడం విశేషం. దీంతో సర్కార్ క్లీన్ హిట్ అని చెప్పాలి.
రాశి ఖన్నా హిట్ కొట్టి చాలా కాలం అవుతుండగా, సర్దార్ ఆమె దాహాన్ని తీర్చింది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రతిరోజూ పండగే తర్వాత రాశి ఖన్నాకు హిట్ పడలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి.
తెలుగులో దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న సమయంలో రాశికి సర్దార్ రూపంలో విజయం దక్కింది. కాగా రాశి ఖాతాలో ఒక బడా ఆఫర్ ఉంది. ఆమె సిద్దార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ మూవీ విజయం సాధిస్తే బాలీవుడ్ లో సెటిల్ కావచ్చని రాశి ఆశపడుతోంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చిన రాశి.... తొలిప్రేమ, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించారు.