ఎన్ని విమర్శలు ఎదురైనా అది చేయడం మానను అంటున్న ప్రణీత సుభాష్... ఈ ఏడాది కూడా!
హీరోయిన్ ప్రణీత సుభాష్ గత ఏడాది ఒక విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. సదరు విమర్శలను తిప్పికొట్టిన ప్రణీత ఈ ఏడాది కూడా ఆచరించారు.
కర్ణాటకలో భీమన అమావాస్యను పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు భార్యలు భర్తలకు పూజలు చేశారు. పాదాలను తాకుతూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ సంప్రదాయాన్ని ప్రణీత శ్రద్దగా పాటిస్తున్నారు. గత ఏడాది కూడా ఆమె భీమన అమావాస్య నాడు భర్తకు పూజలు చేసింది.
ఆమె చర్యలపై కొందరు స్త్రీవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భర్త కాళ్ళను మొక్కడం, పూజించడం బానిసత్వంగా అభివర్ణించారు. పురుషాధిక్య సమాజాన్ని ప్రోత్సహిస్తునట్లుగా ఉందన్నారు. ఈ రోజుల్లో కూడా భర్త పాదాలకు మొక్కడం ఏమిటంటూ ఆమెను ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై ప్రణీత మండిపడ్డారు.
ఇది మా ఆచారం. మా అమ్మ మా నాన్నకు చేసింది. మా పరిసరాలలో ఉన్న మహిళలు కూడా భీమన అమావాస్య ఆచరిస్తారు. సనాతన ధర్మం, ఆచారాలను కాదనే హక్కు ఎవరికీ లేదన్నారు. భర్త కాళ్లకు మొక్కడం వలన స్త్రీ గౌరవం ఏమీ తగ్గిపోదని ఆమె వెల్లడించారు.
Pranitha Subhash
ఈ ఏడాది కూడా భీమన అమావాస్యకు ప్రణీత భర్త కళ్లకు మొక్కారు. పూజలు చేశారు. కొందరు విమర్శలు చేసినా ఈ సనాతన ధర్మాన్ని నేను ఆచరించకుండా ఉండనంటూ ఆమె కామెంట్ చేశారు. ప్రణీత భర్తకు పూజలు చేస్తున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అవుతుంది.
కాగా ప్రణీత సుభాష్ పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తున్నారు. భర్త అనుమతితో సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. దర్శక నిర్మాతలను ఆకర్షించేందుకు గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ప్రణీత స్లిమ్ బాడీలో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
ప్రణీత 2021లో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. ఈ విషయాన్ని ప్రణీత రహస్యంగా ఉంచారు. అనంతరం ఈ మేటర్ లీక్ చేశారు. ఆ వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ప్రణీత తల్లి అయ్యారు. ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. సోషల్ మీడియాలో కూతురు ఫోటోలు షేర్ చేస్తూ ఆమె మురిసిపోతున్నారు. అటు తల్లిగా ఇటు నటిగా రెండు బాధ్యతలు ప్రణీత నెరవేరుస్తున్నారు.
ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి జంటగా ఓ చిత్రానికి సైన్ చేశారు. టాలీవుడ్ లో మాత్రం ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు.
Pranitha Subhash
ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ తో ప్రణీత జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా రభస చిత్రం చేశారు. ఈ మూవీ నిరాశపరిచింది.