- Home
- Entertainment
- రెడ్ ఫ్రాక్ లో కిరాక్ పుట్టిస్తున్న ప్రగ్య జైస్వాల్... బాలయ్య భామ గ్లామరస్ లుక్ వైరల్!
రెడ్ ఫ్రాక్ లో కిరాక్ పుట్టిస్తున్న ప్రగ్య జైస్వాల్... బాలయ్య భామ గ్లామరస్ లుక్ వైరల్!
ప్రగ్య జైస్వాల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. సోషల్ మీడియాలో మాత్రం ఆమె సందడి కొనసాగుతుంది. వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది.

Pragya Jaiswal
ప్రగ్య జైస్వాల్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. ఆమెకు కనీసం ఒక్క ఆఫర్ రావడం లేదు. సన్ ఆఫ్ ఇండియా ప్రగ్య జైస్వాల్ నటించిన చివరి చిత్రం.
Pragya Jaiswal
ప్రగ్య జైస్వాల్ అఖండ మూవీతో భారీ విజయం అందుకుంది. సోలో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రగ్య జైస్వాల్ అఖండ మూవీ నిడివి కలిగిన ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసింది.
Pragya Jaiswal
అఖండ విజయం సాధించినా ప్రగ్యకు ఆఫర్స్ రాలేదు. కనీసం టైరు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. చేతిలో ప్రాజెక్ట్స్ లేకపోవడంతో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ కి తెరలేపుతుంది.
Pragya Jaiswal
ప్రగ్య పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. తమిళ చిత్రం విరాట్టు ఆమె మొదటి చిత్రం. తెలుగులో మిర్చిలాంటి కుర్రోడు మూవీతో ఎంట్రీ ఇచ్చింది.
Pragya Jaiswal
కంచె రూపంలో ఆమెకు మొదటి హిట్ పడింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన క్రిష్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
Pragya Jaiswal
అనంతరం ఓం నమో వెంకటేశాయ, నక్షత్రం చిత్రాల్లో నటించింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది.
Pragya Jaiswal
ఆచారి అమెరికా యాత్ర మూవీ తర్వాత ప్రగ్య జైస్వాల్ కి మూడేళ్లు ఆఫర్స్ రాలేదు. 2021లో అఖండ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సన్ ఆఫ్ ఇండియా మూవీ దెబ్బకు ఆమె కెరీర్ పాతాళానికి పడిపోయింది..