Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బీచ్ వెకేషన్ లో పూజా హెగ్డే హాట్ లుక్... పొట్టి నిక్కర్లలో చక్కర్లు కొడుతున్న బుట్టబొమ్మ!

బీచ్ వెకేషన్ లో పూజా హెగ్డే హాట్ లుక్... పొట్టి నిక్కర్లలో చక్కర్లు కొడుతున్న బుట్టబొమ్మ!

హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం మాల్దీవ్స్ వెకేషన్ లో ఉంది. ఇక ఆహ్లాదకరమైన సాగరతీరంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. పూజా హెగ్డే బీచ్ లుక్స్ వైరల్ అవుతున్నాయి.   

Sambi Reddy | Published : Oct 16 2023, 03:47 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Pooja hegde

Pooja hegde


ఇటీవల 33వ బర్త్ డే జరుపుకుంది పూజా హెగ్డే. ఈ వేడుకల కోసం ఆమె మాల్దీవ్స్ వెళ్ళింది. చేతిలో చిత్రాలు కూడా లేకపోవడంతో కొన్ని రోజులు అక్కడ ప్లాన్ చేసింది. పూజా హెగ్డే బీచ్లో హాట్నెస్ కి తెరలేపుతుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో వెకేషన్ విశేషాలు పంచుకుంటుంది. 
 

27
Pooja hegde

Pooja hegde

మరోవైపు పూజా హెగ్డే(Pooja Hegde)కు బ్యాడ్ టైం నడుస్తుంది. కొత్త ఆఫర్స్ రాకపోగా వచ్చినవి కూడా చేజారుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం నుండి ఆమె తప్పుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఆమె రోల్ ప్రాధాన్యత తగ్గించి సెకండ్ హీరోయిన్ చేశాడట. దాంతో తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి గుంటూరు కారం కి గుడ్ బై చెప్పేసింది. 

37
Pooja hegde

Pooja hegde

మహేష్ బాబు తనను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారనుకుంటే ఆ ఆశ కూడా చేజారింది. గత ఏడాది ఇలానే జనగణమన అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోల్పోయింది. నిర్మాతలు హ్యాండ్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ అటకెక్కింది. 

 

47
Asianet Image

పూజా హెగ్డే కెరీర్ ప్రమాదంలో పడింది. వరుసగా ఆరు ప్లాప్స్  పడ్డాయి. పూజా లేటెస్ట్ రిలీజ్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పరాజయం నేపథ్యంలో పూజా డిప్రెషన్ కి గురయ్యారని సమాచారం.

57
Asianet Image


2022లో ఆమెకు వరుస షాకులు తగిలాయి. ఒకదానికి మించిన మరో డిజాస్టర్ పూజా ఖాతాలో చేరాయి. రాధే శ్యామ్ మూవీతో ఆమె సక్సెస్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్లో భారీ నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. వందల కోట్ల నష్టం రాధే శ్యామ్ మిగిల్చింది.

67
Asianet Image

రాధే శ్యామ్ ఫెయిల్యూర్ నుండి బయటపడే లోపే మరో డిజాస్టర్ పలకరించింది. రాధే శ్యామ్ కి మించిన పరాజయం ఆచార్య చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేస్తారు. ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య పూజాకు ఊహించని షాక్ ఇచ్చింది.రాధే శ్యామ్, ఆచార్య చిత్రాల మధ్యలో ఆమెకు మరో ప్లాప్ పడింది. 

 

77
Asianet Image


విజయ్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. రాధే శ్యామ్, ఆచార్యలతో పోల్చుకుంటే నష్టాలు తక్కువే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన ప్లాప్ మూవీగా బీస్ట్ రికార్డులకు ఎక్కింది. బాలీవుడ్ చిత్రం సర్కస్ వీటన్నింటినీ మించిన డిజాస్టర్ అయ్యింది. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ వరస్ట్ ఫిల్మ్ గా ప్రేక్షకులు అభివర్ణించారు.  

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories