బాయ్ ఫ్రెండ్ బర్త్ డే... ఎవరూ చూడని ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాక్ ఇచ్చిన పాయల్!
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బాయ్ ఫ్రెండ్ బర్త్ డే వేళ సెన్సేషనల్ ఫోటోలు షేర్ చేశారు. ఇంత వరకు ఎవరూ చూడని ఇద్దరి ప్రైవేట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

Payal Rajput
పాయల్ రాజ్ పుత్ చాలా కాలంగా సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్నారు. సౌరభ్ యాక్టర్ కమ్ మోడల్ అలాగే నిర్మాత కూడాను. పాయల్ కెరీర్ బుల్లితెర మీద మొదలైంది. మొదట్లో ఆమె సీరియల్స్ లో నటించారు. ఆ సమయంలో సౌరభ్ దింగ్రాతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
Payal Rajput
పాయల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం అవుతుంది. అప్పటి నుండి సౌరభ్ తో ఆమె రిలేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. సౌరభ్ తన లవర్ గా పాయల్ పరిచయం చేసింది. తరచుగా వీరు విహారాలు చేస్తూ ఉంటారు. పాయల్-సౌరభ్ దింగ్రా ఎఫైర్ బహిరంగ రహస్యమే.
Payal Rajput
కాగా సౌరభ్ బర్త్ డే సందర్భంగా ఒక ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. ''గడచిన కొన్ని సంవత్సరాలు నీ జీవితంలో కఠినమైనవి అని తెలుసు. జీవితం అంటే అంతే. కానీ నువ్వు అంతకన్నా టఫ్. నీకు ఆ భగవంతుడు సమస్యలు ఎదుర్కొనే శక్తి ఇవ్వాలి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా సంతోషానికి, నవ్వుకు, అందమైన జీవితానికి నీవే కారణం... అంటూ సుదీర్ఘ బర్త్ డే నోట్ షేర్ చేశారు.
Payal Rajput
అయితే సౌరభ్ తో కూడిన హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు పాయల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కొన్ని ఫోటోలు దారుణంగా ఉన్నాయి. పాయల్ టాప్ లెస్ గా ఉండగా సౌరభ్ ఆమెను హగ్ చేసుకున్నారు. అలాగే ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో షేర్ చేయని వారిద్దరి రొమాంటిక్ ఫోటోలు పాయల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Payal Rajput
దీంతో పాయల్ బర్త్ డే పోస్ట్ వైరల్ అవుతుంది. మరోవైపు పాయల్ కెరీర్ పరంగా సృగుల్ అవుతుంది. ఆమెకు విజయాలు దక్కడం లేదు.
Payal Rajput
గత ఏడాది పాయల్ తీస్ మార్ ఖాన్, జిన్నా చిత్రాల్లో నటించారు. రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యారు. దాంతో పాయల్ ఆశలు గల్లంతయ్యాయి. పాయల్ నటించిన మయా పేటిక చిత్రం విడుదల కావాల్సి ఉంది.
Payal Rajput
టాలీవుడ్ లో ఆమె జర్నీ ముగిసినట్లనిపిస్తుంది. ఆమె చేతిలో ఒక్క కొత్త తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. టాలీవుడ్ లో దారులు మూసుకుపోగా ఇతర పరిశ్రమలపై దృష్టి పెట్టారు.
Payal Rajput
తమిళ, కన్నడ చిత్రాల్లో పాయల్ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. అక్కడ సక్సెస్ అయితే ఒక పదేళ్లకు ఎలాంటి ఢోకా లేకుండా లాగించేయవచ్చు. మరి చూడాలి పాయల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.