నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు... సంచలనంగా నోరా ఫతేహి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!
హీరోయిన్ నోరా ఫతేహి క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కొందరు తనను డేటింగ్ చేయమని బలవంతం చేశారని, కాంప్రమైజ్ కావాలన్నారని కీలక ఆరోపణలు చేసింది.

Nora Fatehi
క్యాస్టింగ్ కౌచ్ సినిమా పరిశ్రమలో ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. సక్సెస్ అయిన, ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ దీనిపై నోరుమెదపరు. అది తమ కెరీర్ ని నాశనం చేస్తుందని భయపడతారు. ప్రతి నటి ఏదో ఒక దశలో వేధింపులు ఎదుర్కొన్నవారే. ఆఫర్స్ కోసం తప్పక కమిట్మెంట్స్ ఇచ్చామని ఒప్పుకున్నవారున్నారు.
తాజాగా హీరోయిన్ నోరా ఫతేహి బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. కెరీర్ బిగినింగ్ లో తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయట. కొందరు కాంప్రమైజ్ కావాలన్నారట. కమిట్మెంట్స్ అడిగారట. డేటింగ్ చేయాలని బలవంత పెట్టారట.
Nora Fatehi
వాటికి నోరా ఫతేహి లొంగలేదట. నమ్మిన దారిలో వెళ్లారట. ఎవరో ఒక హీరోతో రాసుకుపూసుకు తిరగడం, ఎఫైర్ పెట్టుకోవడం వలన నేను ఎదగలేదు. నా టాలెంట్, కష్టాన్ని నమ్ముకుని ఈ స్థాయికి చేరానని నోరా ఫతేహి చెప్పుకొచ్చారు. ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్ అడిగారని ఆమె కుండబద్దలు కొట్టారు. గతంలో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో నోరా ఫతేహి డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది.
కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది.
నోరా ఫతేహి హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ దక్కించుకోవడం ఊహించని పరిణామం. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇతర కారణాలతో తప్పుకోవడంతో ఆమెకు లక్కీ ఆఫర్ దక్కింది.
హరి హర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. నిధి మెయిన్ హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు.