MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ఆ హీరోయిన్ ని అడ్డంగా బుక్ చేసిన చిరంజీవి కూతురు... ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేశారంటూ బన్నీ హీరోయిన్ ఆవేదన!

ఆ హీరోయిన్ ని అడ్డంగా బుక్ చేసిన చిరంజీవి కూతురు... ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేశారంటూ బన్నీ హీరోయిన్ ఆవేదన!

హీరోయిన్ నివేద పేతురాజ్ కి భారీ షాక్ తగిలింది. ఆమె చేసిన వీడియో జనాల్లోకి నెగిటివ్ గా వెళ్ళింది. సదరు వీడియో చూసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కాల్స్ చేశారట. నిజంగా అలా చేశావా అన్నారట. ఇకపై అలాంటి తప్పు చేయను అంటుంది..   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 03 2024, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నివేద పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్. ఈ చెన్నై భామ మెంటల్ మదిలో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం సాయి ధరమ్ తేజ్ కి జంటగా చిత్రలహరి మూవీ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బ్రోచేవారెవరురా చిత్రంతో క్లీన్ హిట్ అందుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మంచి విజయం సాధించింది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నివేద థామస్ ఇతర ప్రధాన పాత్రలు చేశారు. అనూహ్యంగా అల వైకుంఠపురంలో చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. 
 

37

అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్. అయితే నివేద పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. దాంతో ఆ చిత్ర విజయం ఆమెకు మేలు చేసింది లేదు. రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ... ఇలా పలు తెలుగు చిత్రాలు చేసింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. 

47
Nivetha Pethuraj

Nivetha Pethuraj

ఇటీవల నివేద పేతురాజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వీడియోలో... పోలీసులు ఆమె కారును అడ్డగించారు. కారు చెక్ చేయాలని, డిక్కీ ఓపెన్ చేయాలని ఆమె కోరారు. అందుకు నివేద నిరాకరించింది. పరువుకు సంబంధించిన విషయం, కారు డిక్కీ ఓపెన్ చేయడం కుదరని ఆ వీడియోలో నివేద పోలీసులతో అన్నారు. అప్పటికీ పోలీసులు పట్టుబట్టడంతో వీడియో తీస్తున్న ఫోన్ విసిరేసి దురుసుగా ప్రవర్తించింది. 
 

57

ఈ వీడియో నిజమని నమ్మిన పలువురు నెగిటివ్ కామెంట్స్ చేశారు. నిజానికి ఇది ఫ్రాంక్ వీడియో. కొత్తగా ఆమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసింది. ఈ ప్రమోషనల్ వీడియో నివేద పేతురాజ్ కి చాలా చిక్కులే తెచ్చిపెట్టిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ వీడియో పై ఆమె స్పందించారు.

67

పరువు ప్రమోషనల్ వీడియో ఇంత నెగిటివ్ గా వెళుతుందని నేను ఊహించలేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుండి నాకు కాల్స్ వచ్చాయి. నిజంగా పోలీసులతో గొడవ పడ్డావా? అని అడిగారు. పరువు యూనిట్ సభ్యులకు కాల్ చేసి కనీసం టైటిల్ విడుదల చేయండని వేడుకున్నాను. ఆ నెక్స్ట్ డే టైటిల్ రిలీజ్ చేశారు. మరోసారి ఇలాంటి ప్రమోషనల్ వీడియో చేయకూడదని ఫిక్స్ అయ్యాను... అని నివేద పేతురాజ్ అన్నారు. 

 

77
Nivetha Pethuraj

Nivetha Pethuraj

పరువు వెబ్ సిరీస్ నిర్మాత చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కావడం విశేషం. మరి ఈ ప్రమోషనల్ ప్లాన్ ఎవరిదో కానీ నివేద పేతురాజ్ విమర్శలపాలైంది. గతంలో కూడా ప్రమోషన్స్ కోసం చేసిన ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు తప్పుదారి పట్టాయి. అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ చేసిన పని నెగిటివిటీ మూటగట్టుకుంది. పబ్లిక్ లో న్యూసెన్స్ అని జనాలు మండిపడ్డారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved