ఆ హీరోతో పెళ్ళికి సిద్ధమైన హీరోయిన్ నిత్యా మీనన్..?
హీరోయిన్ నిత్యా మీనన్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోతో ఆమె వివాహం జరగనుందట.

నిత్యా మీనన్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. తరచుగా ఆమె పెళ్లి వార్తలు వినిపిస్తుంటాయి. ఆ మధ్య నిత్యా మీనన్ ప్రెగ్నెంట్ గా కనిపించి షాక్ ఇచ్చింది. వండర్ వుమెన్ అనే ఇంగ్లీష్ మూవీ ప్రమోషన్స్ కోసం నిత్యా మీనన్ ప్రెగ్నెంట్ లేడీ గెటప్ లో ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇవి చర్చకు దారి తీశాయి.
తాజాగా నిత్యా మీనన్ పెళ్లి పుకార్లతో వార్తల్లో నిలిచారు. 35 ఏళ్ల నిత్యా మీనన్ కి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారట. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోతో నిత్యా మీనన్ వివాహం జరగనుందట. సదరు హీరో నిత్యా మీనన్ కి చిన్ననాటి మిత్రుడు అట. ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.
త్వరలో నిత్యా మీనన్ పెళ్లి ప్రకటన రానుందని సమాచారం. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక తనపై పెళ్లిపై వచ్చే వార్తలపై నిత్యా స్పందిస్తారు. గతంలో ఆమె కొన్ని పుకార్లను ఖండించారు. తాజా ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే నిత్యా మీనన్ స్పందించాల్సి ఉంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన నిత్యా మీనన్ 7 ఓ క్లాక్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ అయ్యారు. తెలుగులో ఆమె మొదటి సినిమా అలా మొదలైంది. 2011లో విడుదలైన అలా మొదలైంది సూపర్ హిట్ అందుకుంది. నితిన్ కి జంటగా నటించిన ఇష్క్ నిత్యా మీనన్ కి మరింత ఫేమ్ తెచ్చింది.
Nithya menen
తెలుగులో ఆమె చివరి చిత్రం భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్ భార్య పాత్ర చేసింది. భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్ పాత్ర ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓ మలయాళ చిత్రం చేస్తుంది. నిత్యా మీనన్ మంచి సింగర్ కూడాను. పలు చిత్రాల్లో ఆమె పాటలు పాడారు.