- Home
- Entertainment
- Nidhi-Simbu Marriage: నయనతార మాజీ ప్రియుడితో నిథి అగర్వాల్ పెళ్లి... సీక్రెట్ గా ఏర్పాట్లు.
Nidhi-Simbu Marriage: నయనతార మాజీ ప్రియుడితో నిథి అగర్వాల్ పెళ్లి... సీక్రెట్ గా ఏర్పాట్లు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ వ్యావహారాలు.. లవ్ ఎఫైర్ రూమర్స్ కామన్. ప్రతీ సీజన్ లో ఏదో ఒక వ్యవహారం బయటకు వస్తూనే ఉంటంది. ఈసారి ఈ లిస్ట్ లో గట్టిగా వినిపిస్తున్న జంట నిథి అగర్వాల్, సింబు. ఈ జంట పెళ్లికి కూడా రెడీ అయ్యాటర.

ఇస్మార్ట్ బ్యూటీ నిథి అగర్వాల్, తమిళ స్టార్ హీరో సింబు లవ్ ఎఫైర్ న్యూస్ మరోసారి తెరమీదకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఈ నిధి అగర్వాల్ ప్రేమలో మునిగి తేలుతుందని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఇవి పెళ్లి రూమర్స్ వరకూ వచ్చాయి.
రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లికి సబంధించిన డేట్ ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తమిళ సర్కిల్ లో వార్తలు జోరుగా సాగుతున్నాయి.
వీరి ప్రేమ వ్యవహారం ముందిరి పాకానపడట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తుండటంతో.. వీటికి చెక్ పెట్టేలా వారు ఈ నిర్ణయం తీసుకన్నట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని సమాచారం.
ఇక ఈ విషయం బయటకు తెలియకుండా.. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈశ్వరన్ సినిమా ద్వారా నిథి అగర్వాల్ కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ సినిమా టైమ్ లోనే శింబుతో ఆమె ప్రేమలో పడిపోయిందట. ఆ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్లిందని, ఇప్పటికే నిధి టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్లు కోలీవుడ్ టాక్.
తమిళ స్టార్ హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో ఉన్న రొమాంటిక్ హీరోలలో శింబు ఒకడు. బ్రేకప్ ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా శింబు గురించే చెప్పుకోవాలి. ఈ స్టైలిష్ హీరోకి లైఫ్ లో ఇంతవరకు ప్రేమ అనే మాట కలసి రాలేదు. రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి పీటల వరకు వెళ్లి విఫలం అయ్యాడు. లేడి సూపర్ స్టార్ నయనతార, ఆపిల్ బ్యూటీ హన్సిక తో శింబు నడిపిన ప్రేమ వ్యవహారాలు అందరికి తెలిసినవే.
మరి నిధి-శింబుల పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వారి నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ చూడాల్సిందే ప్రస్తుతం నిథి అగర్వాల్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. నిధి షూటింగ్ పూర్తయిన వెంటనే పెళ్లి పీఠలు ఎక్కుతుందట కన్నడ బ్యూటీ.