- Home
- Entertainment
- హీరోయిన్ నయనతారకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? మైండ్ బ్లోయింగ్ డిటైల్స్!
హీరోయిన్ నయనతారకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? మైండ్ బ్లోయింగ్ డిటైల్స్!
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా వెలిగిపోతుంది నయనతార. ఆమె ఆస్తుల వివరాలు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. అధికారికంగా ఆదాయపన్ను శాఖ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...

Nayanthara
నయనతార మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. 2003లో ఆమె మలయాళ పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టారు. తర్వాత ఆమెకు కోలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాయి. చంద్రముఖి, గజినీ లాంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి. అనంతరం తెలుగులో కూడా స్టార్ అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్నారు. 75కి పైగా చిత్రాలు చేశారు.
నయనతార ఒక్కో సినిమాకు రూ. 5 నుండి 10 కోట్లు తీసుకుంటున్నారు. లేడీ ఓరియెంట్ చిత్రమైతే ఆమె పది కోట్ల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. అదే స్టార్ హీరో మూవీలో నటిస్తే ఐదు కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. నయనతారకు ఇంకా డిమాండ్ తగ్గలేదు. పెళ్ళయాక కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు.
పరిశ్రమకు వచ్చిన ఈ ఇరవై ఏళ్లలో నయనతార పెద్ద మొత్తంలో కూడబెట్టినట్లు సమాచారం అందుతుంది. ఇటీవల ఆదాయపన్ను శాఖకు తన ఆస్తుల విలువ రూ. 200 కోట్లు అని నయనతార అధికారి సమాచారం ఇచ్చారట. ఆమె ఇచ్చిన వివరాల్లో కార్లు, ఖరీదైన బంగ్లాలు, నగలు ఉన్నాయట.
నయనతారకు హైదరాబాద్ బంజారాహిల్స్ లో రెండు లగ్జరీ ఫ్లాట్స్ ఉన్నాయట. ఒక్కో ఫ్లాట్ ధర రూ. 20 కోట్లు ఉంటుందట. చెన్నైలో ఓ లగ్జరీ బంగ్లా ఉందట. కేరళలో తన సొంత ఊరిలో తల్లిదండ్రుల కోసం ఖరీదైన ఇంటిని నిర్మించారట. చెన్నైలో ఓ పురాతన థియేటర్ ని నయనతార కొనుగోలు చేశారని సమాచారం. అక్కడ మల్టీఫ్లెక్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నారట.
నయనతారకు లగ్జరీ కార్లతో పాటు ప్రైవేట్ జెట్ విమానం ఉందట. అధికారిక లెక్కల ప్రకారమే నయనతార ఆస్తి రూ. 200 కోట్లు అయితే... అనధికారికంగా దాని విలువ ఎక్కువే ఉంటుందని అంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండే నయనతార ఇంత పెద్ద మొత్తంలో సంపాదించారు.
<p>nayanthara</p>
కాగా నయనతార గత ఏడాది ప్రియుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సరోగసీ పద్దతిలో నయనతార ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. ఇది ఒకింత వివాదాస్పదమైంది. సరోగసీ చట్టాన్ని ఉల్లగించలేదని ఆధారాలు చూపి నయనతార దంపతులు బయటపడ్డారు.
Nayanthara
ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ కి జంటగా జవాన్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. త్వరలో జవాన్ ట్రైలర్ విడుదల కానుంది. ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు. జవాన్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జవాన్ థియేట్రికల్ హక్కులు రూ. 250 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.