పైట చాటు నుండి తొంగి చూస్తున్న నభా నెలవంక నడుము... లంగా ఓణీలో టెంప్టింగ్ గ్లామర్!
హాఫ్ శారీ ధరించి నభా నటేష్ అబ్బాయిల గుండెల్లో గుబులు రేపింది. నడుము అందాలు హైలెట్ అయ్యేలా హాట్ పోజుల్లో మైండ్ బ్లాక్ చేసింది. నభా నటేష్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Nabha Natesh
నభా నటేష్ కి కాలం కలిసి రాలేదు. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో రేసులో వెనుకబడిపోయింది. 2021లో విడుదలైన మ్యాస్ట్రో మూవీ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు. దాంతో అది ఆమెకు కెరీర్ కి ఉపయోగపడలేదు.
Nabha Natesh
కాగా నభా నటేష్ ప్రమాదం బారిన పడ్డారట. ఆ ప్రమాదంలో నభా ఎడమ భుజం ఫ్రాక్చర్ అయ్యిందట. దానికి పలు సర్జరీలు జరిగాయట. కోలుకునే సమయంలో మానసికంగా శారీరకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు ఆ మధ్య వెల్లడించారు.
Nabha Natesh
ఇక నభా కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ మూవీగా ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రామ్ హీరోగా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ అందరికీ ఊపిరి పోసింది.
Nabha Natesh
ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చిన ఆనందం ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. అనేక అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా దారుణమైన ఫలితం అందుకుంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా సంక్రాంతి రిలీజ్ అల్లుడు అదుర్స్ ప్లాప్ ఖాతాలో చేరిపోయింది.
Nabha Natesh
కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో నెట్టుకు రావడం కష్టమే. తెలుగులో నభా నటేష్ జోరు తగ్గగా... కృతి శెట్టి, శ్రీలీల దూసుకుపోతున్నారు. ముఖ్యంగా శ్రీలీల క్రేజీ ఆఫర్స్ తో సత్తా చాటుతుంది.
Nabha Natesh
ఆఫర్స్ కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది నభా నటేష్. సోయగాలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేస్తుంది. నభా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.
Nabha Natesh
ఇస్మార్ట్ శంకర్ కాంబో రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. డబల్ ఇస్మార్ట్ టైటిల్ తో పూరి జగన్నాథ్-రామ్ పోతినేని సినిమా చేస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నేటి నుండి షూటింగ్ జరగనుంది.
Nabha Natesh
డబుల్ ఇస్మార్ట్ మూవీలో హీరోయిన్స్ ని ఇంకా ప్రకటించలేదు. నభా ప్రయత్నం చేస్తే కనీసం సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కే ఆస్కారం కలదు. నభాకు కొంత ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె చిత్రాలు చేస్తే చూడాలని ఆశపడుతున్నారు.