- Home
- Entertainment
- డైరెక్టర్‌ని ఉంచుకుంటానంటూ హీరోయిన్ బోల్డ్ స్టేట్‌మెంట్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..
డైరెక్టర్‌ని ఉంచుకుంటానంటూ హీరోయిన్ బోల్డ్ స్టేట్‌మెంట్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..
హీరోయిన్ మాళవిక నాయర్ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ క్యూట్ లవ్ స్టోరీస్‌తో అలరిస్తుంది. డీసెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె బోల్డ్ కామెంట్ చేసి వార్తల్లోకి ఎక్కింది.

మాళవిక నాయర్ తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారింది. క్యూట్‌గా, ట్రెడిషనల్‌గా కనిపించే, అలాంటి సినిమాలే, అలాంటి పాత్రల్లోనే మెరిసే ఈ భామ బోల్డ్ కామెంట్ చేసింది. ఏకంగా దర్శకుడిని ఉంచుకుంటానంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఆ దర్శకుడు ఎవరో కాదు `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్. ఆయన్ని ఏమనుకోవద్దని, ఉంచుకుంటానని చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే మాళవిక మాటలకు అనుదీప్ సిగ్గుపడుతూ ముఖం మూసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నెటిజన్లని అలరిస్తుంది. హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇదంతా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న `అన్నీ మంచి శకునములే` చిత్ర ప్రమోషన్స్ కోసం కావడం విశేషం. ఈ నెల 18న ఇది విడుదల కాబోతుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సంతోష్ శోభన్ హీరోగా నటించారు.
ఈ సినిమా ప్రమోషన్స్ ని ఇలా డిఫరెంట్‌గా ప్లాన్ చేసి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసే ప్రయత్నం చేసింది యూనిట్. ఆ విషయంలో టీమ్ సక్సెస్ అయ్యింది. కానీ హీరోయిన్ మాళవిక మాత్రం ట్రోల్స్ కి గురయ్యింది. ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఉంచుకోవడం అంటే ఎట్లా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రకరకాల పోలికలతో ఆడుకుంటున్నారు.
అందులో భాగంగా రవితేజ హీరోగా నటించిన `విక్రమార్కుడు` సినిమాలోని రాజీవ్ కనకాల సీన్‌తో పోలుస్తూ కామెంట్లు పెట్టడం షాకిస్తుంది. మరికొందరు ఆయన్ని కాదు, తమని ఉంచుకోండి అంటున్నారు. `నన్ను ఉంచుకో ప్లీజ్ నీ కాళ్లు మొక్కుతా` అని, మా వాళ్లు కూడా ఖాళీగానే ఉన్నారని ఉంచుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొందరు బూతులతో విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ఇది ప్రమోషన్స్ తోపాటు నటిపై విమర్శలు కూడా రావడం విచారకరం.
అయితే మాళవిక, అనుదీప్‌లపై ఈ వీడియో చేయడం వెనకాల ఏదో అర్థం ఉండి ఉంటుంది. అది సినిమాకి లింక్ అయి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అదేంటనేది సస్పెన్స్ నెలకొంది. ట్రైలర్‌లోగానీ ఆ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కానీ ఈ `ఉంచుకోవడం` అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.