అప్పుడేనా అంటూనే.... కాబోయేవాడి గురించి వెల్లడించిన హీరోయిన్ మాధవీలత
పెళ్ళి గురించి గతంలో సోషల్ మీడియా జనాలకు వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ మాధవీలత.. తాజాగా తన పెళ్లి గురించి షాకింగ్ విషయం వెల్లడించింది. తనకు కాబోయే వాడిగురించి ఓపెన్ అయ్యింది బ్యూటీ.

ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ తో వార్తల్లో నిలుస్తుంటుంది తెలుగు హీరోయిన్ మాధవీలత. బోల్డ్ కామెంట్స్...కాంట్రవర్సియల్ కామెంట్స్ కు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది మాధవీ లత. నచ్చవులే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాధవి.. ఆతరువా వరుస ఆఫర్లు సాధించింది కాని.. హిట్లు మాత్రం తగల్లేదు మాధవీలతకు.
పట్టుమని పదేళ్లు కూడా ఇండస్ట్రీలో యాక్టీవ్ గా ఉండలేక పోయింది మాధవీలత. ఇక ప్రస్తుతం కాంట్రవర్సీలకు క్లోజ్ గా ఉంటూ.. ఎప్పుడూ ఏదో ఓక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మాధవీలత. ఏదో రకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ... సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది.
ఆమధ్య పెళ్లిపై బోల్డ్ కామెంట్స్ చేసింది మాధవిలత. పెళ్ళి చేసుకోవాలంటే వయసు వస్తే సరిపోదని.. మానసికంగా, శారీరకంగా సిద్దంగా ఉండాలని ఆమె అన్నారు. ఆ మాటలు అన్న కొన్ని రోజులకే పెళ్ళిపూ ఆమె చేసిన కామెంట్లు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.
త్వరలో ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా మాధవీలత చెప్పడం విశేషం. నాకు కాబోయే భర్త వివరాలు త్వరలో వెల్లడిస్తాను అంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. మాధవీలత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అది నిజమో కాదో తెలియాలంటే ఆమె అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన మాధవిలత ఆతరువాత అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని… రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.2019 ఎన్నికల్లో బిజెపి పార్టీ తరుపున గుంటూరు నుండీ పోటీ చేసిన మాథవీలత పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే.
మాధవీలత రకరకా కాంట్రవర్సీ కామెంట్స్ కు సెంటర్ గా నిలిచింది.బిగ్‌బాస్‌పై..హీరో నాగార్జునపై గట్టిగానే కామెంట్స్ చేసింది. గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు మా నాగ్ మామ అంటూ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసిన బ్యూటీ.. బిగ్ బాస్ హౌస్ ముద్దులు, హగ్గులు, రొమాన్స్ కి అడ్డాగా మారిందని దుమ్మెత్తిపోసింది.