Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • వయసు అంతకంతకూ తగ్గుంది... హీరోయిన్ లయ అన్నం తింటుందా అమృతం తాగుతుందా!

వయసు అంతకంతకూ తగ్గుంది... హీరోయిన్ లయ అన్నం తింటుందా అమృతం తాగుతుందా!

  హీరోయిన్ లయ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ చేస్తున్నారు. గ్లామర్ విందు చేస్తూ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.  

Sambi Reddy | Updated : May 28 2023, 10:16 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image


లయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. చీర కట్టిన లయ కొవ్వొత్తుల కాంతుల్లో సరికొత్తగా మెరిశారు. వయసు పెరిగేకుంది ఆమెలోని గ్లామర్ రెట్టింపు అవుతుండగా, ఇన్నాళ్లు ఈ అందం ఎక్కడ దాచిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

28
Asianet Image


నాలుగు పదుల వయసు దాటిన లయ సౌందర్యం అబ్బురపరుస్తుంది. విజయవాడకు చెందిన లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. 1992లో విడుదలైన భద్రం కొడుకో మూవీలో లయ లీడ్ రోల్ చేశారు. ఆ మూవీ స్ట్రీట్ చైల్డ్స్ పై తీసిన చిత్రం. 
 

38
Asianet Image

హీరోయిన్ గా లయ మొదటి చిత్రం స్వయంవరం. హీరో వేణు తొట్టెంపూడి కూడా హీరోగా పరిచయమయ్యాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్వయం వరం మంచి విజయాన్ని సాధించించింది. ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. 

48
Asianet Image


తెలుగులో లయకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా టైర్ టూ హీరోల ఛాయిస్ గా మారారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న లయకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కాయి. ప్రేమించు ఈ తరహా చిత్రమే. ప్రేమించు మూవీలో లయదే ప్రధాన పాత్ర. సాయి కిరణ్ హీరో. 
 

58
Asianet Image


సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమించు లో లయ అంధురాలు పాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉంది కొద్ది రోజులే అయినా 50 కి పైగా చిత్రాల్లో లయ నటించారు. 
 

68
Asianet Image

విజయేంద్రవర్మ మూవీలో లయ బాలకృష్ణకు జంటగా నటించారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. 2006 వరకు లయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. చిన్నదో పెద్దదో ఆఫర్స్ మాత్రం ఆగలేదు. 2006లో కాలిఫోర్నియాలో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గోర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో పాటు కాలిఫోర్నియా వెళ్లిపోయారు. లయ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయి పేరు శ్లోక కాగా అబ్బాయి పేరు వచన్. 
 

78
Asianet Image

హీరోయిన్ గా 2010లో విడుదలైన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం చివరి చిత్రం. 2018లో శ్రీను వైట్ల-రవితేజ కాంబోలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో లయ నటించారు. 

 

88
Asianet Image

ప్రస్తుతం లయ అమెరికాలో జాబ్ చేస్తున్నారు. లయ పని చేస్తున్న సంస్థ పేరు జోబి ఏవియేషన్. ఈ ఎయిర్ బస్ సంస్థలో లయ కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారట. అయితే లయ భర్తకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా తిని కూర్చోవడం ఇష్టం లేని లయ తన అభిరుచి మేరకు జాబ్ చేస్తుంది.

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
ఆ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నా..ముగ్గురు హీరోయిన్లపై డైరెక్టర్ మారుతి కామెంట్స్
ఆ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నా..ముగ్గురు హీరోయిన్లపై డైరెక్టర్ మారుతి కామెంట్స్
మళ్ళీ జంటగా కనిపించబోతున్న సమంత, నాగ చైతన్య.. ఫ్యాన్స్ కి రొమాంటిక్ ఫీస్ట్ గ్యారెంటీ
మళ్ళీ జంటగా కనిపించబోతున్న సమంత, నాగ చైతన్య.. ఫ్యాన్స్ కి రొమాంటిక్ ఫీస్ట్ గ్యారెంటీ
ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ వచ్చేసింది..రెబల్ స్టార్ కామెడీ టైమింగ్ చూశారా, మైండ్ బ్లోయింగ్ విజువల్స్
ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ వచ్చేసింది..రెబల్ స్టార్ కామెడీ టైమింగ్ చూశారా, మైండ్ బ్లోయింగ్ విజువల్స్
Top Stories