పూల చీరలో పరువాలు ఎరవేసిన కృతి సనన్... ప్రభాస్ హీరోయిన్ గ్లామరస్ ఫోటో షూట్ వైరల్!
కృతి సనన్ గ్లామర్ ఐకాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బాలీవుడ్ భామ ఇంస్టాగ్రామ్ వేదికగా తరచూ అందాలతో అలరిస్తుంది. పరువాలు ఎరవేస్తూ కుర్రాళ్లను గిలిగింతలు పెడుతుంది.
Kriti Sanon
తెలుగు రంగుపై ఎర్ర పూల డిజైన్ కలిగిన చీర ధరించి కృతి సనన్ మనోహరంగా ఉన్నారు. చూడగానే కట్టిపడేసే ఆమె అందం నెటిజెన్స్ ని గిలిగింతలు పెట్టింది. కృతి సనన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
Kriti Sanon
కృతి కెరీర్ పరిశీలిస్తే ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. ప్రభాస్ కి జంటగా ఆమె నటించిన ఆదిపురుష్ నిరాశపరిచింది. చెప్పాలంటే ఆదిపురుష్ పెద్ద ఎత్తున విమర్శలపాలైంది. ఆధునిక రామాయణం పేరుతో ఓమ్ ప్రయోగం వికటించింది. మరోవైపు ప్రభాస్-కృతి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్స్ ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. త్వరలో ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఆయన కామెంట్ ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది.
Kriti Sanon
కృతి-ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ కి హీరో వరుణ్ ధావన్ కామెంట్స్ కూడా కారణమయ్యాయి.గత ఏడాది విడుదలైన బేడియా మూవీ ప్రమోషన్స్ కోసం కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో యాంకర్ గా కరణ్ జోహార్ వ్యవహరించారు. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్, వరుణ్ ని అడిగారు. ఎందుకంటే... కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడు. మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్ లో చేస్తున్నాడని, వరుణ్ కామెంట్ చేశాడు.
Kriti Sanon
పరోక్షంగా ప్రభాస్ కృతి సనన్ ని ప్రేమిస్తున్నట్లు వరుణ్ కామెంట్స్ ఉన్నాయి. కాగా ఈ రూమర్స్ పై కృతి సనన్ స్పందించారు. ఇవన్నీ నిరాధార కథానాలంటూ ఆమె కొట్టిపారేశారు. ప్రభాస్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. అలాగే మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేల్చి పారేశారు.
Kriti Sanon
టైగర్ ష్రాఫ్ కి జంటగా గణ్ పథ్ చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన గణ్ పథ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీస వసూళ్లు రాబట్టడంలో విపలం చెందింది. ప్రస్తుతం మూడు హిందీ చిత్రాల్లో ఆమె నటిస్తుంది.
Kriti Sanon
కృతి వెండితెరకు పరిచయమైంది తెలుగులోనే. దర్శకుడు సుకుమార్ ఆమెను హీరోయిన్ చేశాడు. వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ కి జంటగా కృతిని తీసుకున్నారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
Kriti Sanon
కృతి సనన్ గ్లామర్ ఐకాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బాలీవుడ్ భామ ఇంస్టాగ్రామ్ వేదికగా తరచూ అందాలతో అలరిస్తుంది. పరువాలు ఎరవేస్తూ కుర్రాళ్లను గిలిగింతలు పెడుతుంది.