- Home
- Entertainment
- స్టార్ కమెడియన్ తో కీర్తి రహస్య వివాహం, అల్లుడికి ఫోన్ చేసి మేనక ఏమన్నారో తెలుసా? ఇంత జరిగిందా!
స్టార్ కమెడియన్ తో కీర్తి రహస్య వివాహం, అల్లుడికి ఫోన్ చేసి మేనక ఏమన్నారో తెలుసా? ఇంత జరిగిందా!
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి వార్త సంచలనం రేపుతోంది. ఆమె కమెడియన్ సతీష్ ని రహస్య వివాహం చేసుకుందట. ఈ విషయం తెలిసిన కీర్తి సురేష్ తల్లి మేనక అల్లుడు సతీష్ కి కాల్ చేసిందట. ఈ విషయాన్ని సతీష్ స్వయంగా చెప్పాడు. మరి మేనక రియాక్షన్ ఏమిటో చూద్దాం...
- FB
- TW
- Linkdin
Follow Us

కీర్తి సురేష్ హోమ్లీ హీరోయిన్. ఆమెకు సిల్వర్ స్క్రీన్ పై క్లీన్ ఇమేజ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం పలు రూమర్స్ ఆమె ఫేస్ చేసింది. హీరో విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లతో కీర్తి ఎఫైర్స్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే కేరళకు చెందిన ఒక రిసార్ట్ ఓనర్ తో కీర్తి ప్రేమలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.
ఇలా పలుమార్లు కీర్తి సురేష్ ఎఫైర్, మ్యారేజ్ వార్తలతో పతాక శీర్షికలకు ఎక్కింది. తాజాగా కోలీవుడ్ కమెడియన్ సతీష్ తో కీర్తి సురేష్ పెళ్లి జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీరిద్దరూ మెడలో దండలు వేడుకుని పక్కపక్కనే నిల్చున్న ఫోటో వైరల్ అవుతుంది.
సతీష్ ని కీర్తి సురేష్ రహస్య వివాహం చేసుకుంది అనేది ఆ కథనాల సారాంశం. కీర్తి సురేష్-సతీష్ ఫోటో వైరల్ కావడంతో ఫ్యాన్స్ లో అయోమయం నెలకొంది. నిజంగా కీర్తి సురేష్ పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . ఈ కథనాలపై సతీష్ తో పాటు కీర్తి సురేష్ తల్లి మేనక స్పందించారు.
actor sathish
సతీష్ మాట్లాడుతూ... కీర్తి సురేష్ ని నేను రహస్య వివాహం చేసుకున్నానన్న వార్తలు వస్తుండగా, మేనకా సురేష్ నుండి నాకు ఫోన్ వచ్చింది. నేను కంగారు పడ్డాను. ఫోన్ లిఫ్ట్ చేద్దామా వద్దా? అనుకున్నాను. ఫోన్ ఎత్తగానే... మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నీకు కంగ్రాట్స్. మీరు సంతోషంగా కాపురం చేసుకోండని దీవించింది... అంటూ నవ్వేశాడు.
ఇక మేనక మాట్లాడుతూ... నా కూతురు పెళ్లి వార్తలు ఆశ్చర్యం తో పాటు వినోదం పంచుతాయి. కమెడియన్ సతీష్ ని కీర్తి సురేష్ పెళ్లి చేసుకుందన్న వార్తలు ఫన్నీగా ఉన్నాయి. మీడియాలో అబద్దాలు ఎంతగా ప్రచారం అవుతాయో ఈ పుకార్లు తెలియజేస్తున్నాయి, అని అన్నారు.
Keerthy Suresh
కాగా విజయ్-కీర్తి సురేష్ జంటగా భైరవ టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఈ మూవీలో సతీష్ కమెడియన్ రోల్ చేశారు. భైరవ చిత్ర పూజ కార్యక్రమాల్లో కీర్తి, సతీష్ దండలు వేసుకు దిగిన ఫోటో వైరల్ చేసిన కొందరు, రహస్య వివాహం జరిగిందని ప్రచారం చేశారు. అదన్న మాట మేటర్. నిజంగా కీర్తి-సతీష్ పెళ్లి చేసుకోలేదు..