ఉల్లిపొర చీరలో పరువాలని కనిపించేలా... సన్నజాజి సోయగాలతో చంపేసిన కత్రినా బేబీ!
తెలుగు ప్రేక్షకులను మల్లీశ్వరిగా పలకరించి అల్లరి పిడుగు తర్వాత టాలీవుడ్ కి ముఖం చాటేసింది కత్రినా కైఫ్. చేసింది రెండు చిత్రాలే అయినా ఇన్నోసెంట్ మల్లీశ్వరిగా అప్పటి యూత్ మనస్సులో నిలిచిపోయింది. బాలీవుడ్ లో బిజీ కావడంతో ఇటువైపు రాలేదు.

Katrina Kaif
కత్రినా ఓ స్ట్రైట్ మూవీ చేస్తే చూడాలనేది ప్రేక్షకుల కోరిక. ఇకపై ఆ కోరిక తీరడం కష్టమే. పెళ్లి కూడా చేసుకున్న కత్రినా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరింది. చిత్రాలు చేస్తున్నప్పటికీ ఒకప్పటి జోరు లేదు.
Katrina Kaif
హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడిపిన కత్రినా కైఫ్ 2021 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఖరీదైన డిజైనర్ వేర్స్ ధరించి వధూవరులు మెరిసిపోయారు.
Katrina Kaif
ఆగష్టు 30 రాత్రి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భర్త విక్కీ కౌశల్ తో జంటగా హాజరయ్యారు. షిమ్మరి శారీ ధరించిన కత్రినా పిచ్చెక్కించే గ్లామర్ తో ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
Katrina Kaif
ఇక సర్దార్ ఉద్ధం చిత్రంలోని నటనకు గానూ విక్కీ కౌశల్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకున్నారు. ఫిలిం ఫేమ్ అవార్డ్స్ వేదికపై విక్కీ కౌశల్ కాలా చెస్మా సాంగ్ పాడి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు.అవార్డు గెలుచుకున్న ఆనందంలో కత్రినాను ముద్దాడారు.
Katrina Kaif
వివాహం అనంతరం కూడా కత్రినా కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మూడు బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. ఫోన్ బూత్, మెర్రీ క్రిస్మస్ చిత్రాలు చేస్తున్నారు.
Katrina Kaif
అలాగే సల్మాన్ కి జంటగా టైగర్ 3 మూవీ చేస్తున్నారు. ఏక్తా టైగర్ సిరీస్ లో ఇది మూడో చిత్రం. పరిశ్రమలో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు విక్కీ అరడజనుకు పైగా చిత్రలతో ఫుల్ బిజీగా గా ఉన్నారు.