రీ ఎంట్రీ కోసం రెడీ అవుతున్న కామ్నా జెఠ్మలానీ, కాకరేపుతున్న కామ్నాహాట్ ఫోటోస్
ఈమధ్య కనుమరుగైన హీరోయిన్లు రీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది రీఎంట్రీ అయిపోయింది కూడా. ఈక్రమంలోనే.. తెరకు దూరమయిన బ్యూటీ కామ్నా జెఠ్మలానీ కూడా మళ్ళీ ఎంట్రీకి ప్లాన్ చేస్తుందట.

కామ్నా జెఠ్మలానీ.. అప్పట్లో తెలుగు తెరను ఒక ఊపు ఊపేసింది. దశాబ్ధం క్రితం వరకూ కామ్నా కత్తిలాంటి అందాలతో తెరపై వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన నటించకపోయినా..టైర్2 హీరోల తో మాత్రం రచ్చ రచ్చ చేసింది బ్యూటీ.. కొంత కాలానికి తెరమరుగైన ఈహీరోయిన్ ఇప్పుడు రీ ఎంట్రీ ప్లాన్ చేస్తుందట.
<p>kamna</p>
స్టార్ హీరోయిన్లను మించిన గ్లామర్.. నాజూకు అందాలతో మంచి కలర్, ఫిగర్ తో కామ్నా సొంతం. కాని ఎందుకో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. బెండు అప్పరావు ఆర్ ఎంపీ లాంటి సినిమాలలో కామ్నా అందాలు.. అబ్బబ్బా అనిపిస్తాయి. కాని ఆతరువాత అసలు తెరకే దూరం అయ్యింది బ్యూటీ.
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న హీరోయిన్ జెఠ్మలానీ.. కొన్నాళ్లు వరుస సినిమాలు చేసి.. కెరీర్ డౌన్ అవుతున్న టైమ్ లో పెళ్లి చేసుకుని సినిమాలకు బై బై చెప్పేసింది.. అంతే కాదు వెంటనే ఇద్దరు పిల్లల్ని కూడా కనేసింది. ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ ఉండిపోయింది.
2014లో సూరజ్ నాగ్‌పాల్ అనే బెంగుళూర్ బిజినెస్ మెన్‌ని పెళ్లి చేసుకుంది కామ్నా. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా ఫిట్ నెస్ విషయంలో కాని.. బ్యూటీ విషయంలో కాని ఎక్కడా రాజీ పడకుండా కాపాడుకుంటూ వస్తోంది. రీ ఎంట్రీ ఆలోచన ఉండబట్టే.. కామ్నా ఫిగర్ ను కాపాడుకుంటుంది అని అంటున్నారు సినీ జనాలు.
అంతే కాదు ఎప్పటికప్పుడు తన గ్లామరస్ పిక్స్, వర్కౌట్ వీడియోస్ ను తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేస్తూ.. సందడి చేస్తుంది. పిల్లలు కాస్త పెద్దవాళ్లు అవ్వడం.. స్కూల్ కు వెళ్తుండటంతో.. ఖాళీ టైమ్ దొరుకుతుందట.. ఈక్రమంలోనే రీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటుందని. దానికోసమే హాట్ ఫోటో షూట్స్ కూడా చేస్తుందంటున్నారు.
కామ్నా ఫోటో షూట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రకరకాల కామెట్లు కూడా పెడుతున్నారునెటిజన్లు. త్వరగా తెరపై కనిపనించమంటున్నారు. ఇక తెలుగులో ప్రేమికులు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ... ఆతరువాత వరుసగా.. ఈ ముంబై భామ సూపర్ హిట్ సినిమాలు చేసింది..
రణం, సామాన్యుడు, బెండు అప్పారావు, కత్తి కాంతారావు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాని కొంత కాలానికి అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది కామ్నా.
ఆతరువాత హీరోయిన్ గా డౌన్ అవ్వడంతో .. సూపర్ స్టార్ మహేష్ బాబు సైనికుడు, నాగార్జున కింగ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెరిసింది కామ్నా. ఇటు తెలుగుతో పాటు.. అటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ మూవీస్ చేసింది కామ్నా జఠ్మలానీ..
ఇక రీ ఎంట్రీలో ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి. అసలు రీ ఎంట్రీ ఇస్తుందో లేదో కూడా చూడాలి.