Ileana: కడుపులో బిడ్డ తంతున్నాడంటున్న పెళ్లి కాని తల్లి ఇలియానా!
ఇలియానా డి క్రూజ్ గర్భవతిగా తన అనుభవాలు ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. కడుపులో బిడ్డ తంతున్నాడు, నిద్ర కూడా పట్టడం లేదని ఆమె అభిమానులకు తెలియజేశారు.

Ileana
హీరోయిన్ ఇలియానా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. గర్భవతిగా తనకు ఎదురవుతున్న అనుభవాలు అభిమానులతో షేర్ చేస్తున్నారు. ఇలియానాకు నెలలు నిండుతున్న తరుణంలో బిడ్డ కదలికలు ఆమెకు అర్థం అవుతున్నాయట. కడుపులో బిడ్డ తంతున్నాడని, దాని వలన పడుకోలేకపోతున్నాను. నిద్ర కూడా పట్టడం లేదని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన లేటెస్ట్ పిక్ షేర్ చేశారు. ఇది వైరల్ గా మారింది.
Ileana D Cruz
ఏప్రిల్ 18న హీరోయిన్ ఇలియానా డి క్రూజ్ పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఆమె గర్భం దాల్చినట్లు నేరుగా ప్రకటించారు. 'నా బుజ్జాయి కోసం ఎదురుచూస్తున్నా' అని కామెంట్ పెట్టిన ఇలియానా గర్భాన్ని ధ్రువీకరించేలా ఫోటోలు పోస్ట్ చేశారు. పెళ్ళి కాకుండా తల్లయ్యానని ఇంత నిర్భయంగా ప్రకటించిన ఇలియానా తెగింపు హాట్ న్యూస్ అయ్యింది. తాజాగా ఆమె బేబీ బంప్ రివీల్ చేశారు. తన గర్భాన్ని చూపిస్తూ చిన్న వీడియో చేశారు. అది ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి ఇలియానా బేబీ బంప్ చూపించారు.
ఇలియానాను తల్లిని చేసింది ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెన్ట్ మైఖేల్ అనే ప్రచారం జరుగుతుంది. రహస్యంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఈ క్రమంలో ఇలియానా గర్భవతి అయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఇలియానా ఖండించలేదు. అదే సమయంలో సమర్ధించలేదు. అభిమానులను సందిగ్ధంలో పెట్టి ఇలియానా చంపేస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే ఆమె ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. ఇటీవల 'సబ్ గజబ్' టైటిల్ తో ఓ ఆల్బమ్ చేశారు. ఆ సాంగ్ లో ఇలియానా లుక్ నిరాశపరిచింది. బెల్లీ అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇలియానా హిప్ షేప్ కోల్పోయి దారుణంగా కనిపించారు. ఆమె తల్లి కావడం కూడా దీనికి కారణం కావచ్చు. ఇలియానా చేసిన కొన్ని తప్పులు పాతాళంలోకి తొక్కేశాయి. గొప్ప ఆరంభం లభించినా నిలదొక్కుకోలేకపోయింది.
సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న సమయంలో నార్త్ పై కన్నేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది.2012లో విడుదలైన బర్ఫీ చిత్రంలో రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు.
ఆ వెంటనే వచ్చిన ‘పోకిరి’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కొన్నేండ్ల పాటు తెలుగుతోపాటు సౌత్ సినిమాల్లో దుమ్ములేపారు. స్టార్ హీరోల సరసన నటించి గుర్తుండిపోయే సినిమాలు చేశారు. మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా గట్టిగానే సంపాదించుకున్నారు.
సినిమాకు సైన్ చేసిన ఇలియానా రూ.40 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారంట. అయితే కొన్ని కారణాలతో సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ను పే బ్యాక్ చేయాలని ఇలియానను కోరారు. దీంతో గోవా బ్యూటీ నిరాకరించినట్టు ప్రచారం. దీంతో ఆ నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ను సంప్రదించారని తెలుస్తోంది.