వాళ్ళకోసమే సినిమాలు మానేశాను... హీరోయిన్ జెనీలియా కామెంట్స్ వైరల్
చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ వెండితెరపై మెరవబోతోంది హీరోయిన్ జెనీలియా. ఈసందర్భంగా తాను సినిమాలకు దూరం అవ్వడానికి కారణం ఏంటీ అనేది వివరిస్తూనే... కెరీర్ పై క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.

టాలీవుడ్ ను ఓ పదేళ్లు ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లలో జెనిలీయా ఒకరు. నాజూకు సొకులతో.. స్లిమ్ గా ఉండే ఈ బ్యూటీ.. స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. టాలీవుడ్ లో వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో కెరీర్ లో మంచి ఇమేజ్ ను సాధించింది బ్యూటీ. ఇక మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లోనే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది బ్యూటీ.
బొమ్మరిల్లు, ఢీ, రెడీ, సై లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింద జెనీలియా. దాదాపు పదేళ్లకు పైగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. నా ఇష్టం సినిమా తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది. పూర్తిగా పర్సనల్ లైఫ్ కు కమిట్ అయ్యింది జెనీలియా.
బాలీవుడ్ యాక్టర్.. మాజీ సీఎం తనయుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్ళాడిన ఈ బ్యూటీ.. పెండ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవగా ఉంటూ వచ్చింది జెనీలియా. తన భర్తకు సబంధించిన విషయాలు, పిల్లలు, ఫ్యామిలీతో స్పెండ్ చేసిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ వచ్చింది బ్యూటీ.
ఇక చాలా కాలం తరువాత.. భర్త రితేష్‌తో కలిసి జెనీలియా ఓ సినిమాలో నటించింది. వేద్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈమూవీ తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమాకు మరాఠీ రీమేక్. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ సాధించడంతో పాటు జెనీలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఈ సందర్భంగా జెనీలియా కొన్ని విషయాలు వెల్లడించింది. తాను సినిమాలు ఎందుకు వదిలింది వివరించింది బ్యూటీ. జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాల్సిందే. రెండు పడవల మీద ప్రయాణం సాగదు. పెండ్లయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించా. సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం కుదరలేదు. అందుకే సినిమాలు వదిలేశా అని అన్నారు జెనీలియా.
ఇక అంతే కాదు అలాంటి నిర్ణయం తీసుకోండం వల్లే ఈరోజు ఒక మంచి ఇల్లాలిగా కుటుంబంలో పేరు తెచ్చుకున్నానన్నారు స్టార్ బ్యూటీ. ఫ్యామిలీని చూసుకుంటూనే.. ప్రొడ్యూసర్‌గా సొంత ప్రొడక్షన్ చేస్తున్నా. మరికొన్ని బిజినెస్ లలో కూడా అడుగుపెట్టాను అన్నారు మాజీ హీరోయిన్. ఇక చాలా కాలం తరువాత నటిగా తనను తాను చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు జెనీలియా.
ఇక ఇప్పుడు కూడా తనకు నచ్చిన..మెచ్చిన.. మంచి కథ దొరికితే సినిమాలు చేయడానికి తనకు ఎటువంటి అబ్యంతరం లేదు అంటోంది జెనీలియా. అయితే అది ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తానంటోంది బ్యూటీ.