త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్న బిందు మాధవి..?
తమిళంలో హీరోయిన్ గా బిజీ అయిపోయింది తెలుగుమ్మాయి బిందుమాధవి. టాలీవుడ్ లో అవకాశాలు లేక కోలీవుడ్ కు వలస వెళ్లింది బ్యూటీ. అక్కడ కాస్తబాగానే రాణిస్తోంది. ఇక ఈక్రమంల బిందు మాధవికి ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది. అదేంటంటే..?

తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన బిందు మాధవి... టాలీవుడో లో స్టార్డమ్ కాని.. హీరోయిన్ గా మంచి కెరీర్ ను కాని సాధించలేకపోయింది. ఇక ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో.. ఇక మకాం తమిళ్ కు మార్చేసింది. కోలీవుడ్ లో కాస్తో కూస్తో హీరోయిన్ గా పర్వాలేదు అనిపించింది. అయితే లవ్ బ్రేకప్ కారణంగా అక్కడ కూడా తన యాక్టింగ్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది బిందు మాధవి. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ విన్నర్ అయిన తర్వాత బిందు మాధవి కెరీర్ మళ్లీ పట్టాలెక్కింది.
Bindu Madhavi
అయితే ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్ లు చేస్తోంది బ్యూటీ. తాజాగా ఆమెకు వెబ్ సిరీస్ ల నుంచి ఆఫర్లు బాగా వస్తున్నాయి. ఇప్పటికే న్యూసెన్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ మే 12న ఆహాలో విడుదల కానుంది. ఇక ఈ సిరీస్ కు సబంధించి ప్రమోషన్ ఈవెంట్లను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. హైదరాబాద్ లో మీడియా మీట్ ఏర్పాటు చేశారు టీమ్. అయితే ఈ మీడియా మీట్ లో వారికి షాకింగ్ క్వశ్చన్స్ ఎదురయ్యాయి.
బింధు మాధవికి కూడా ఒక చిత్రమైన ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేశారనే వార్తలు వచ్చాయి అవి నిజమేనా? అని ప్రశ్నించారు. అందుకు బిందు మాధవి సూటిగా సమాధానం చెప్పింది. అవి రూమర్స్ కాదని.. త్రిష మాజీ ప్రియుడు వరుణ్ మణియన్ తో తాను నిజంగానే డేటింగ్ లో ఉన్నానంటూ బిందు మాధవి ఒప్పుకుంది. దాంతో ఒక్కసారింగా అంతా షాక్ అయ్యారు.
నేను నిజంగానే త్రిష మాజీ ప్రియుడు వరుణ్ మణియన్ తో డేటింగ్ లో ఉన్నాను. కాకపోతే అది వేరు వేరు సందర్భాల్లో జరిగింది. ఒకే సమయంలో మేము ఇద్దరం డేటింగ్ లో లేము. త్రిషతో బ్రేకప్ తర్వాత నాతే డేట్ చేశారు. దాంట్లో ఎటువంటి అబద్దం లేదు.. అంటూ బిందు మాధవి సమాధానం చెప్పింది. నిజానికి ఒక హీరోయిన్ తన లవ్ ట్రాక్ గురించి ఇంత ఓపెన్ గా చెప్పడం అది కూడా త్రిష మాట కూడా రావడం అంతా షాక్ అవుతున్నారు.
<p>Bindu madhavi</p>
బిగ్ బాస్ ఓటీటీలో విన్నర్ గా బయటకు వచ్చిన తరువాత బిందుమాధవి లైఫ్ కాస్త గాడిన పడింది. ఆమెకు వెబ్ సిరీస్ ల అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. వీటి ద్వారా సినిమా అవకాశాలు కూడా రావాలని ఆమె కోరుకుంది. ఈసారి మాత్రం తెలుగులో కూడా అవకాశాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్టు ఆమె అన్నారు. ప్రస్తుతం బిందుమాధవి బోల్డ్ ఆన్సర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రెస్ మీట్ లో టాలీవుడ్ రొమాంటిక్ హీరో నవదీప్ కూడా పాల్గోన్నారు. ఈసందర్భంగా అతనికి కూడా వింత వింత ప్రశ్నలే ఎదురయ్యాయి. యాంకర్ చాలా విషయాలను అడగ్గా.. నవదీప్ తనపై వచ్చిన డ్రంక్ అండ్ డ్రైమ్ ఇష్యూ ఒక్కటి నిజమని.. ఇక తన వల్ల ఎవరో చనిపోయారు అన్నది మాత్రం వాస్తవం కాదు అన్నారు నవదీప్.