- Home
- Entertainment
- Happy Onam: ఓనమ్ వేడుకల్లో అనుపమ పరమేశ్వరన్... పండగ లుక్ లో కట్టి పడేస్తున్న కేరళ కుట్టి!
Happy Onam: ఓనమ్ వేడుకల్లో అనుపమ పరమేశ్వరన్... పండగ లుక్ లో కట్టి పడేస్తున్న కేరళ కుట్టి!
నేడు ఓనమ్ పండుగ కాగా బంగారు అంచు తెల్ల చీరలో అద్భుతంగా తయారైంది అనుపమ పరమేశ్వరన్. ఆమె పండగ లుక్ వైరల్ అవుతుంది.

కేరళ జనాలకు ఓనమ్ (Happy Onam)అతిపెద్ద పండుగ. హిందువులు ఘనంగా ఈ పండగ చేసుకుంటున్నారు. ఓనమ్ రోజు బంగారు అంచు తెల్లచీర ధరించడం సాంప్రదాయం. మహిళలు తప్పక ఈ సాంప్రదాయం పాటిస్తారు.
స్టార్ లేడీ అనుపమ పరమేశ్వరన్ సైతం ఓనమ్ వేడుక జరుపుకుంటుంది. తన ఇంట్లో పండగ ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే చివరి ఫోటోతో షాక్ ఇచ్చింది.
అరిటాకులో అన్ని వంటలు వడ్డించిన ఇస్తరి ఫోటో లాప్ టాప్ ఓపెన్ చేసి చూపించింది. అంటే పండగకు అనుపమ(Anupama Parameswaran) వంటలు చేయలేదా? అందుకే ఫోటోలో చూసి అందిస్తున్నా అని సింబాలిక్ గా చెప్పిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక అనుపమ ఓనమ్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెల్ల చీరలో మీరు అద్భుతంగా ఉన్నారని కితాబు ఇస్తున్నారు.
అనుపమ కెరీర్ పరిశీలిస్తే... ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డకు జంటగా టిల్లు స్క్వేర్ మూవీ చేస్తుంది. ఇది డీజే టిల్లు మూవీకి సీక్వెల్. ఈ చిత్రంలో ఆమె బోల్డ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.
ఆ మధ్య అవకాశాల కోసం ఎదురు చూసిన అనుపమ కార్తికేయ 2 తో ఫార్మ్ లోకి వచ్చింది.కెరీర్ ప్రమాదంలో పడగా భారీ హిట్ తో మైలేజ్ తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
కార్తికేయ 2 హిందీలో విజయం సాధించడం మరో విశేషం. పెద్ద హీరోల చిత్రాలకు షాక్ ఇస్తూ కార్తికేయ 2 ఊహించిన వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 హిందీ వెర్షన్ దాదాపు రూ. 30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
అయితే కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ హక్కులతో 18 పేజెస్ ప్రాఫిట్ వెంచర్ గా మిగిలినట్లు సమాచారం.
కాగా బటర్ ఫ్లై టైటిల్ తో అనుపమ ఒక ఓటీటీ మూవీ చేశారు. అది కూడా నిరాశపరిచింది. కార్తికేయ 2 అనంతరం ఆమెకు రెండు ప్లాప్స్ పడ్డాయి. టిల్లు స్క్వేర్ తో పాటు ఓ మలయాళ, తమిళ చిత్రంలో అనుపమ నటిస్తున్నారు.
నేడు ఓనమ్ పండుగ కాగా బంగారు అంచు తెల్ల చీరలో అద్భుతంగా తయారైంది అనుపమ పరమేశ్వరన్. ఆమె పండగ లుక్ వైరల్ అవుతుంది.