మరీ సన్నమవుతున్న నటి అను ఇమ్మాన్యుయేల్.. ‘హెల్త్ ఓకేనా’ అంటూ ఫ్యాన్స్ ఆందోళన!
యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) రోజురోజుకు మరింత సన్నగా మారుతోంది. ఒకప్పుడు బొద్దుగా.. ముద్దుగా కనిపించిన ఈ భామా బక్కచిక్కిపోవడంతో అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన పడుతున్నారు.

హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ బాలనటిగానే తన కేరీర్ ను ప్రారంభించింది. మలయాళీ ఫ్యామిలీకి చెందిన ఈముద్దుగుమ్మ ‘స్వప్న సంచారి’ అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమైంది. ‘యాక్షన్ హీరొ బిజు’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఈ రెండు చిత్రాల తర్వా నేరుగా టాలీవుడ్ లోనే అడుగుపెట్టింది.
నేచురల్ స్టార్ నాని సరసన ‘మజ్ను’లో నటించి హిట్ అందుకుంది. తొలి చిత్రంతోనే సక్సెస్ రుచి చూసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి బడా స్టార్స్ సరసన నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది.
ముఖ్యంగా అను ఇమ్మాన్యుయేల్ తన గ్లామర్ తోనే యూత్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కేరీర్ బిగినింగ్ లో అట్రాక్టివ్ ఫిజిక్, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ మధ్య కాస్తా బరువెక్కిపోవడంతో.. కొన్నాళ్లుగా డైటింగ్, హెవీ ఎక్సర్ సైజులు చేస్తూ సన్నగా మారుతోంది.
ఈ క్రమంలో మరీ సన్నంగా మారడంతో తనకేమైనా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయా అంటూ.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అను ఓ పిక్ ను షేర్ చేయడంతో ‘హెల్త్ ఓకేనా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పిక్ లోనూ అను చాలా బక్కగా కనిపించడం చూడొచ్చు.
అవకాశాల కోసం ఆరాటపడుతూ తన ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటుందేమోనని అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఇప్పటికే హెల్త్ పై శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్ మెంట్ వేడుకల్లో అను ఇమ్మాన్యుయేల్ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది.
కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్ సరైన హిట్టు పడటం లేదు. తెలుగు, తమిళ చిత్రాలనే నమ్ముకున్న ఈ బ్యూటీకి ఒక్కప్రాజెక్ట్ కూడా కలిసి రావడం లేదు. చివరిగా ‘ఊర్వసివో రాక్షసివో’తో అలరించింది. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ‘రావణాసుర’లో నటిస్తోంది. తమిళంలోనూ ఓ సినిమాలో మెరియనుంది.