- Home
- Entertainment
- Sai Pallavi Shocking Look:సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం.. సినిమాలు వదిలి రైతు కూలీగా మారిన హీరోయిన్
Sai Pallavi Shocking Look:సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం.. సినిమాలు వదిలి రైతు కూలీగా మారిన హీరోయిన్
చాలా రోజులు అవుతుంది సాయి పల్లవి కనిపించి. చివరిగా శ్యామ్ సింగ్ రాయ్ లో అలరించిన సాయి. ఆతరువాత వేరే సినిమాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. మరి సాయి పల్లవి ప్రస్తుతం ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది బ్యూటీ.

ప్రేమమ్ తో అందరినీ ఆకట్టుకున్న సాయిపల్లవి చాలా తక్కువ టైమ్ లోనే హీరోయిన్ గా స్టార్ డమ్ ను సాధించింది. కాని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా హీరోయిన్ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ.. తన స్థాయిని పెంచుకుంటుంది.
చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఫిదా భామ. తెలుగులో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. వరుసగా ఆఫర్లను పొందుతూ స్టార్ హీరోలతో, యంగ్ స్టార్ హీరోలతో జత కడుతూ.. తెగ హడావిడి చేస్తోంది. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది సాయి పల్లవి.
అయితే ఆమె ఈ సినిమా తరువాత ఆమె మాత్రం ఎక్కువగా బయట కనిపించలేదు. సినిమాలు కూడా చేస్తున్నట్టు జాడ లేదు. ఏ ఈవెంట్ లో కనిపించలేదు. ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవి ఎక్కడుందా అని వెతకడం ప్రారంభించారు. అయితే ఫ్యానస్ కు షాక్ ఇస్తూ.. సాయి పల్లవి ఓ ఫోటోను షేర్ చేసింది.
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి రైతుకూలీగా అవతారం ఎత్తింది. ఎక్కడో చేస్తుందో తెలియదుగానీ.. కూలీగా మారి పొలంలో పసుపును ఏరింది. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వేర్లతో భూమిలోకి బలంగా నాటుకుపోయాయి.. అయినా, పెకిలించి బయటకు తీసేశాం అంటూ ఆమె కామెంట్ చేసింది.
దానికి చాలా మంది కో స్టార్లు, హీరోయిన్లు, అభిమానులు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. సాయి పల్లవి పోస్ట్ కి చాలా మంది హీరోయిన్లు కూడా రిప్లై ఇస్తున్నారు. చాలా నచ్చిందంటూ అనుపమ పరమేశ్వరన్ ఎమోజీ పెట్టి కామెంట్ చేసింది. నీలా ఎవరూ ఉండలేరు అంటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్ చేసింది.
ఇక సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఇదేంటిది.. సాయిపల్లవి ఇలా అయిపోయిందేంటి అంటున్నారు. మరికొంత మంది మాత్రం సాయి పల్లవి గొప్పతనం ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న డాక్టర్ సాయి పల్లవి.. నెక్ట్స్ ఏ సినమా చేస్తుందో చూడాలి.