కాలేజ్ ఎగ్గొట్టి అబ్బాయిలతో సినిమాలకు వెళ్లేదానివట.. ఎవరు చెప్పారు, ఆలీ ఆన్సర్ కి కామ్నా షాక్!
2005లో వచ్చిన ప్రేమికులు మూవీతో వెండితెరకు పరిచమైంది హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి ఇరవై చిత్రాల వరకూ చేసింది. ఆమె కెరీర్ లో గోపిచంద్ కి జంటగా నటించిన రణం సూపర్ హిట్ గా నిలిచింది.
అల్లరి నరేష్ కి జంటగా ఆమె నటించిన బెండు అప్పారావ్ ఆర్ ఎంపీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 2014లో బెంగుళూరికి చెందిన బిజినెస్ మాన్ నాగ్ పాల్ ని కామ్నా వివాహం చేసుకున్నారు.
కామ్నా జఠ్మలానీకి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కెరీర్ బిగినింగ్ లో సూపర్ హిట్స్ అందుకున్న కామ్నా జఠ్మలానీ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకుంటే, త్వరగా ఫేడవుట్ అయ్యారు.
ఇక తెలుగు పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది కామ్నా జఠ్మలానీ. ఈ కార్యక్రమంలో ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఇద్దరు పిల్లల తల్లిలా కనిపించడం లేదని ఆలీ అడుగగా... అది జీన్స్ ద్వారా సంక్రమించిందని, అమ్మమ్మ 80ఏళ్ళు వచ్చినా చాలా యంగ్ గా కనిపిస్తారని అన్నారు .
సాధారణంగా ఉమెన్స్ కాలేజ్ బంక్ కొడితే అమ్మాయిలతో సినిమాలకు వెళతారు. మీరేంటి అబ్బాయిలతో వెళ్లేవారట అని ఆడుగగా, నాకు సినిమాలు, షికార్లు ఫుబ్స్ కి వెళ్లడం చాలా సరదాగా ఉండేది, అనిపిస్తే అబ్బాయిలు ఫ్రెండ్స్ కూడా వెళ్లేదానిని అంటూ ఓపెన్ గా చెప్పేసింది.
ఐదారు హిట్ సినిమాలు వచ్చినా కెరీర్ సరిగా ఎందుకు ప్లాన్ చేసుకోలేదని ఆలీ అడిగారు... దానికి నా బాడ్ లక్ అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కామ్నా.
అప్పట్లో తనకు ఓ పెద్ద సినిమా ఆఫర్ రావడం, అడ్వాన్స్ తీసుకోవడం కూడా జరిగిందని అన్నారు.
ఒక తమిళ డైరెక్టర్ తనని జూనియర్ శ్రీదేవి అన్నారని, ప్రకాష్ రాజ్ లాంటి నటుడు చాలా బాగా నటిస్తున్నావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడని కామ్నా గుర్తు చేసుకున్నారు.
ఇక కామ్నా జఠ్మలానీ చెప్పిన పూర్తి సంగతులు తెలియాలి అంటే అలీతో సరదాగా ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.