KGF2 Review: కేజీఎఫ్ 2 ప్రీమియర్ షో టాక్.. దడ పుట్టించేలా రాఖీ భాయ్ సింహ గర్జన
కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. దీనితో రెండవ భాగంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి.

KGF2
కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. దీనితో రెండవ భాగంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కేజిఎఫ్ 2 చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి రాజమౌళి పాన్ ఇండియా చిత్రాల రికార్డులని అదిమిస్తుంది అంటూ కేజీఎఫ్ 2పై అంచనాలు ఏర్పడ్డాయి.
KGF2
ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది.. అంచనాలని అందుకుందా అనేది ఇప్పుడు చూద్దాం. రాఖీ భాయ్ కథని విజయేంద్ర వాసిరాజుగా ప్రకాష్ రాజ్ చెప్పడం ప్రారంభించారు. రాఖీ భాయ్ గా హీరో యష్ ఇంట్రడక్షన్ సన్నివేశం కళ్ళు చెదిరే విధంగా ఉంది. ఫాన్స్ చేత విజిల్ కొట్టించే సీన్ అని చెప్పొచ్చు.
KGF2
మాస్ ఎలిమెంట్స్ తో సాగిన తుఫాన్ సాంగ్ తర్వాత అధీరకి సంబందించిన సన్నివేశాలు మొదలవుతాయి. సంజయ్ దత్ అధీగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాఖీ భాయ్ ని టార్గెట్ చేస్తారు. రాఖీ భాయ్ కి ఎదురుదెబ్బ తగులుతుంది. కానీ రాఖీ భాయ్ తక్కువ టైం లోనే తేరుకుని ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఇలాంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది.
KGF2
సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉందని చెప్పాలి. ప్రశాంత్ నీల్ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన విధానం అద్భుతం. టెక్నికల్ గా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మెస్మరైజ్ చేస్తాయి. అలాగే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా యష్ ఎంట్రీ, సంజయ్ దత్ ఎంట్రీ సీన్స్ హైలైట్ అని చెప్పాలి. విజువల్స్ కళ్ళు చెదిరేలా ఉన్నా ఫస్ట్ హాఫ్ లో యావరేజ్ కంటెంట్ తో సాగింది.
KGF2
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతి సన్నివేశంలో భారీ తనం ఉండేలా చూసుకున్నారు. కానీ ఎక్కడో కొంత కనెక్టివిటీ మిస్ అయిందనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చాలా బావుంది. అలాగే సెకండ్ హాఫ్ లో రవీనా టాండన్ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంది.
KGF2
ఇక సినిమా మొత్తం ప్రశాంత్ నీల్ శైలిలో ఎలివేషన్స్ సీన్స్ బాగా పడ్డాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. కేజీఎఫ్ 2 ఒక మంచి సీక్వెల్ గా మిగిలిపోతుంది. క్లైమాక్స్ లో యష్, అధీరా మధ్య వచ్చే యాక్షన్ బ్లాక్ అల్టిమేట్ అనే చెప్పాలి. టెక్నికల్ గా ప్రశాంత్ నీల్ క్లైమాక్స్ ని అద్భుతంగా చిత్రీకరించారు.
KGF2
కేజిఎఫ్ లో లాగే చాప్టర్ 3 లో కూడా ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ పై ఫోకస్ పెట్టాడు. ఇక రాఖీ భాయ్ గా యష్ రాక్ సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి నటన, స్టైల్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం.
KGF2
సినిమాలో భారీతనం, ఎక్కువగా లౌడ్ గా గర్జిస్తున్నట్లు ఉండే సీన్స్ ఉన్నాయి. కథ పరంగా కేజిఎఫ్ 2 ప్రభావవంతమైన చిత్రం కాదనే చెప్పాలి. కానీ ఫ్యాన్స్ కి కావలసిన స్టఫ్ అక్కడక్కడా ఉంది. కొన్ని సీన్స్ లో అనుభూతిని దర్శకుడు వేరే లెవల్ కి తీసుకు వెళతారు. ఓవరాల్ గా కేజిఎఫ్ 2 మంచి సీక్వెల్ గా , టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఉన్న చిత్రంగా ప్రశంసలు దక్కించుకోవడం ఖాయం.