Hero Vijay Comments: సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన విజయ్, బీస్ట్ డైరెక్టర్ కు సీక్రెట్ చెప్పేసిన తమిళ దళపతి
రిలీజ్ కు రెడీ అవుతుంది భీస్ట్ మూవీ. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీమ్. ఇక ఈసారి ఓ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు దళపతి విజయ్. మీడియాకు దూరంగా ఉండే విజయ్.. తాను ఎందుకు అలా చేస్తాడో కూడా వివరంగా వివరించాడు.
కరోనా భయం పోయి సినిమాలన్నీ రిలీజ్ కు వరుసకడుతున్నాయి. ఇక రేపు(13 ఏప్రిల్) రిలీజ్ కాబోతోంది తమిళ స్టార్ హీరో విజయ్ భీస్ట్ మూవీ. ఈ మూవీ రిలీజ్ కు అన్ని సన్నాహాలు చేశారు టీమ్. నెల్సన్ దిలీజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయి గా నటించింది.
సాధారణంగా విజయ్ మీడియా ముందుకు రాడు. తన సినిమా ప్రమోషన్స్ లో కూడా కనిపించడు. ప్రెస్ మీట్లకు, ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటాడు విజయ్. అయితే ఈసారి మాత్రం ఆయన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి హీరో ప్రెస్ మీట్ లో పాల్గొనడం అందరిని ఆశ్చర్యపరిచింది.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి హీరో విజయ్ మీడియా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీస్ట్ ప్రచార కార్యక్రమాల్లో విజయ్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను ఎందుకు మీడియాకు దూరంగా ఉంటాడో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు విజయ్ వివరించినట్టు సమాచారం.
సరిగా..పదకొండేళ్ల క్రితం ఓ సంఘటనతో తాను మీడియాకు దూరమయ్యానన్నారు విజయ్. దానికి కూడా ఓ రీజన్ ఉందుంటన్నారు. ఓ ఇంటర్వ్యూలో తాను ఒకటి చెబితే, వాళ్లు మరొకటి రాశారని ఆరోపించారు. మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి షాక్ అయ్యాడట విజయ్.
అసలు తను అనని మాటలను తానే అన్నట్టుగా అందులో రాశారని. ఆ వ్యాఖ్యలు చేసింది నేనేనా అని అనిపించిందని వివరించారు. నువ్విలా మాట్లాడావంటే నమ్మలేకపోతున్నాం అని తనకు కావల్సిన వాళు కూడా అంటుంటే ఏం చేయాలో, ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఏదురయ్యిందన్నారు విజయ్.
అప్పుడు తాను అనని మాటలు అన్నట్టుగా రాశారని, దాంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయని విజయ్ తెలిపారు. ఇంట్లో వాళ్లకు నిజమేంటో తెలుసు కాని బయటవాళ్శకు తాను ఏం చెప్పగలనన్నారు విజయ్. అంతే కాదు వాళ్లందరికీ తాను సర్దిచెప్పలేను కదా..? అని వ్యాఖ్యానించారు.
అందుకే అప్పట్నించి విజయ్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఏది ఏమైన విజయ్ ఇన్నేళ్లకు మళ్లీ ప్రమోషన్స్ లో కనిపించడంతో.. విజయ్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. బీస్ట్ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఇక బీస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సిసిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దాంతో పాటు బీస్ట్ రిలీజ్ అయిన తరువాతి రోజు అంటే ఏప్రిల్ 14న పాన్ ఇండియా రేంజ్ లో కెజియఫ్ రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ... ఆసక్తి కరం కాబోతోంది.