MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • VD11 Movie Launch : ఘనంగా హీరో విజయ్ దేవరకొండ, సమంత మూవీ ప్రారంభోత్సవం.. రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడంటే?

VD11 Movie Launch : ఘనంగా హీరో విజయ్ దేవరకొండ, సమంత మూవీ ప్రారంభోత్సవం.. రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడంటే?

హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ ప్రేమ కథా చిత్రం రూపుదిద్దుకోనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 21 2022, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లోమరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 
 

27

విజయ్ దేవరకొండ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) క్లాప్ ఇవ్వగా...ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు.
 

37

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. గీత గోవిందం లాంటి ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో విజయ్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లైగర్ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత మళ్లీ చక్కటి కుటుంబ కథలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. 

47

నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి తన సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేయబోతున్నారు. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించగా...ఈ సినిమా వారి పెయిర్ ను ఫుల్ ఫ్లెజ్డ్ గా తెరపై చూపించబోతోంది. 
 

57

ఇక మజిలీ చిత్రం తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ సంస్థలో మరోసారి హీరోగా నటిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. 
 

67

అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభకానున్నట్టు తెలిపారు. కశ్మీర్ లో మొదటి షెడ్యూల్ ను చిత్రీకరణ మొదలవుతుంది. అక్కడ ఈ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ జరుపుకుంటుందని తెలిపారు.  

77

ఈ చిత్రంలో నటీనటులుగా విజయ్ దేవరకొండ, సమంత (Samantha), జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి, నిర్మాతలుగా నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి వ్యవహరిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన టాప్‌ 5 మూవీస్‌ ఇవే
Recommended image2
Asha Bhosle Net Worth: ఫ్యామిలీకి వందల కోట్లు వదిలివెళ్లిన లెజెండరీ సింగర్.. ఆశా భోంస్లే ఆస్తులు ఎంతంటే?
Recommended image3
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved