కెజిఎఫ్ స్టార్ యష్ పై రవితేజ కామెంట్స్... నీపై గౌరవం పోయిందంటూ ఫ్యాన్స్ ఫైర్
రవితేజ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. యష్ ఫ్యాన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు.

హీరో రవితేజకు వివాదరహితుడు అనే పేరుంది. సుదీర్ఘ కెరీర్లో ఆయనపై పెద్దగా ఆరోపణలు లేవు. కొన్నేళ్ల క్రితం డ్రగ్ కేసులో ఆయన పేరు వినిపించింది. విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ హీరో యష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి.
యాంకర్ ఒక్కో సౌత్ ఇండియా స్టార్ పేరు చెబుతూ వాళ్లపై రవితేజ అభిప్రాయం షార్ట్ గా చెప్పాలన్నారు. రామ్ చరణ్ గురించి అడగ్గా... మంచి డాన్సర్. రామ్ చరణ్ డాన్స్ అంటే నాకు ఇష్టం అన్నాడు. అనంతరం ప్రభాస్ గురించి అడగ్గా.. అప్పీరెన్స్. చూడ్డానికి డార్లింగ్ చాలా బాగుంటాడు అని చెప్పాడు.
kgf 2
అనంతరం విజయ్ గురించి అడగ్గా... విజయ్ కూడా మంచి డాన్సర్. చాలా బాగా డాన్స్ చేస్తారు అని చెప్పాడు. మీరు కూడా మంచి డాన్సర్ అనగా... లేదు నేను డాన్సర్ కాదు. జస్ట్ మానేజ్ చేస్తాను అంతే అన్నాడు. చివరిగా యష్ గురించి అడిగింది యాంకర్. ఆయన గురించి నాకు తెలిసింది తక్కువ. యష్ అంటే కెజిఎఫ్. అలాంటి సినిమా ఆయనకు రావడం అదృష్టం అన్నారు.
రవితేజ అభిప్రాయంలో యష్ కేవలం కెజిఎఫ్ వలన స్టార్ అయ్యాడు. ఆ సినిమా అతనికి లక్ తెచ్చిపెట్టింది. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు అన్నట్లుగా ఉంది. టాలెంట్ లేకుండా అదృష్టంతో పైకి వచ్చాడని రవితేజ అన్నట్లు యష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రవితేజపై విమర్శలు వెల్లువెత్తాయి.
రవితేజకు వ్యతిరేకంగా యష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన నీపై గౌరవం ఉండేది. ఇప్పుడు అదిపోయింది. యష్ విషయంలో నువ్వు ఇగో బయటపెట్టావు. యష్ కేవలం కెజిఎఫ్ వలన స్టార్ కాలేదు. అంతకు ముందే ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.
కెజిఎఫ్ సక్సెస్ లో యష్ పాత్ర ఎంతగానో ఉంది. అతడు దేశం మొత్తం తిరిగి సినిమాను ప్రోమోట్ చేశాడు. స్క్రిప్ట్, డైలాగ్స్ విషయంలో ఆయన ప్రమేయం ఉంది. కెజిఎఫ్ కి ముందు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాప్స్ లో ఉన్నాడు. కాబట్టి కెజిఎఫ్ చేయడం అతడి అదృష్టం కాదు. నువ్వు కనీసం కెజిఎఫ్ సౌత్ రికార్డు కొట్టి చూపించు అంటూ రవితేజకు సవాల్ విసురుతున్నారు.
రవితేజ ఉద్దేశం ఏదైనా కానీ ఆయన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఇది టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. సౌత్ లో తెలుగు చిత్రాలకు కన్నడ మంచి మార్కెట్. అక్కడ టైగర్ నాగేశ్వరరావును అడ్డుకుంటే వసూళ్లు కోల్పోవాల్సి వస్తుంది.
ఇటీవల కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా సైతం ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నాడు. కెజిఎఫ్ ఓ చెత్త సినిమా అన్నట్లు మాట్లాడాడు. దాంతో కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా వెంకటేష్ మహాను ఏకి పారేశారు. వెంకటేష్ మహా కామెంట్స్ తీవ్ర వివాదం రాజేశాయి. కాగా టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా విడుదల కానుంది.