అన్నయ్య అప్పులు తీర్చడానికి ఇష్టం లేకపోయినా ఆ సినిమాలు చేశా... డబ్బుల కోసమే పవన్ నటించిన సినిమాలివే!
గబ్బర్ సింగ్ సినిమా ఆర్థిక సమస్యలు కారణంగానే చేశాను. నిజానికి ఆ సినిమా చేయడం నాకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
Pawan Kalyan
గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. దీనికి సీక్వెల్ గా 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ ఇష్టం లేకపోయినా ఆర్థిక సమస్యల కారణంగా చేయాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ గతంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Pawan Kalyan
పరాజయాలతో ఇబ్బందిపడుతున్న పవన్ కళ్యాణ్ దబంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ మూవీ చేశాడు. దర్శకుడు హరీష్ శంకర్ ఒరిజినల్ సినిమాకు భారీగా మార్పులు చేసి గబ్బర్ సింగ్ తెరకెక్కించాడు. 2012 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ఆయన భారీగా లాభపడ్డాడు.
Pawan Kalyan
గబ్బర్ సింగ్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు పవన్ కళ్యాణ్. హిట్ ట్రాక్ ఎక్కాడు. గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ తెరకెక్కింది. కే ఎస్ రవీంద్ర ఈ చిత్ర దర్శకుడు. పవన్ కళ్యాణ్ కథను సమకూర్చడం విశేషం. సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం నిరాశ పరిచింది. ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Pawan Kalyan
కాగా గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలను పవన్ కళ్యాణ్ కేవలం డబ్బుల కోసమే చేశాడట. అన్నయ్య నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నాడట. దాని కోసం ఒక చిత్రం చేశాడట. అలాగే ఫైనాన్సియర్స్ కి డబ్బులు చెల్లించాల్సి ఉండగా... త్వరగా పూర్తి అయ్యే ఒక సినిమా చేయాలని మరొక చిత్రం చేశాడట.
Pawan Kalyan
గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ చిత్రాలు నేను ఇష్టపడి చేయలేదు. కేవలం ఆర్థిక ఇబ్బందులను బయటపడాలనే చేశానని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాగా, గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో బిజీ అయ్యారు. ఆయన హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. ఈ చిత్రాల నిర్మాతలు ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే ఏడాది ఆలస్యమైంది. అదిగో ఇదిగో పవన్ వస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ మూడు చిత్రాలు పట్టాలెక్కిన దాఖలాలు లేవు.