MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • తండ్రి ఏఎన్నార్ కి తెలియకుండా అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున సరదాలు, ఏం చేసాడో తెలుసా?

తండ్రి ఏఎన్నార్ కి తెలియకుండా అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున సరదాలు, ఏం చేసాడో తెలుసా?

అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ కి తెలియకుండా బీరు తాగేవాడట. నాగార్జున ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 31 2024, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ హైదరాబాద్ కి రావడానికి కృషి చేసిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. తనతో మూవీ చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలకు హైదరాబాద్ లో చిత్రీకరణ జరపాలని కండిషన్ పెట్టేవారట. ఈ క్రమంలో అవకాశాలు చేజారినా ఆయన పట్టువీడలేదట. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

భార్య పేరిట నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో అంటే ఏఎన్నార్ కి చాలా ఇష్టం. తరచుగా ఆయన సందర్శిస్తూ ఉండేవారట. అన్నపూర్ణ స్టూడియోతో ఆయనకు అనుబంధం పెనవేసుకుంది. 2014లో ఏఎన్నార్ కన్నుమూశారు. కుటుంబ సభ్యులు అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల విగ్రహం ఏర్పాటు చేశారు. ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఏఎన్నార్ తో తమకున్న అనుభవాలు, అనుబంధాన్ని పంచుకున్నారు. 

 

36

దశాబ్దాలుగా అన్నపూర్ణ స్టూడియో చిత్ర నిర్మాణానికి అవసరమైన సేవలు అందిస్తుంది. అన్నపూర్ణ స్టూడియో నాగార్జున సారథ్యంలో సక్సెస్ఫుల్ గా సాగుతుంది. డిసెంబర్ 4న హీరో నాగ చైతన్య-శోభితల వివాహం ఇక్కడే జరిగింది.  కాగా ఈ స్టూడియో ఆవరణలో తండ్రి ఏఎన్నార్ కి తెలియకుండా చేసిన చిన్న చిన్న సరదాల గురించి ఒకసారి నాగార్జున ఓపెన్ అయ్యారు. 

46

అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగిందట. గూఢచారి ప్రమోషనల్ ఈవెంట్ కి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. గూఢచారి చిత్ర యూనిట్ 17 రోజులు అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో షూటింగ్ జరిపారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. అది కూడా ఫ్లోర్ లో కాకుండా బయట. అన్నపూర్ణ స్టూడియోలో నాకు తెలియని లొకేషన్స్ ఏమున్నాయి? అన్ని రోజులు షూటింగ్ ఎలా చేశారు? అంటూ..  నాగార్జున ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

56

ఆయన ఇంకా మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోని మీలా ఇంకెవరు వాడి ఉండరు. ఇప్పుడు నాన్న ఉంటే చాలా సంతోషించేవారు. నేను చిన్నప్పుడు నాన్నకు తెలియకుండా లోపల ఫారెస్ట్ లోకి వెళ్లి బీర్ తాగేవాడిని, మీరు ఆ ఫారెస్ట్ లో షూటింగ్ చేసారు, అన్నారు. సెట్స్ లో కాకుండా అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో ఉన్న చెట్ల మధ్య అన్ని రోజులు షూటింగ్ ఎలా చేశారనేది... నాగార్జున భావన. 

 

66


ఆయన ఫ్లోలో... స్టూడియోలో ఉన్న చెట్ల చాటుకు వెళ్లి ఏఎన్నార్ కి తెలియకుండా బీర్ తాగిన విషయం లీక్ చేశాడు. అదన్నమాట సంగతి. మరోవైపు నాగార్జున నా సామిరంగ మూవీతో ఓ మోస్తరు విజయం ఆదుకున్నారు. ప్రస్తుతం కూలీ, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. రజినీకాంత్-లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ చిత్రంలో నాగార్జున రోల్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. అలాగే ధనుష్ తో చేస్తున్న కుబేరలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నారట. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర టీజర్ మెప్పించింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved