Manchu Vishnu : కపుల్ గోల్స్.. భార్యను సర్ ప్రైజ్ చేసిన మంచు విష్ణు.. ఏం చేశాడంటే?
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఆయన వెడ్డింగ్ యానివర్సరీ కావడం విశేషం. ఈ సందర్భంగా భార్యను ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేశారు.

హీరో మంచు విష్ణు ప్రస్తుతం న్యూజిలాండ్ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కెరీర్ లో ప్రస్తుతం భారీ బడ్జెట్ తో సినిమా రూపుదిద్దుకుంటోంది.
‘కన్నప్ప’ Kannappa పేరుతో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే.. ఈరోజు మంచు విష్ణు వెడ్డింగ్ యానివర్సీ కావడం విశేషం. ఈ సందర్భంగా విష్ణు తన భార్య విరానికను ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
న్యూజిలాండ్ లో షూటింగ్ బిజీలో ఉన్న ఈయన తన భార్యను ఏకంగా ఆ దేశానికి రప్పించి.. ప్రత్యేకమైన చాపర్ లో బ్యూటీఫుల్ లోకేషన్లను చూపిస్తూ.. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దంపతులు పంచుకన్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీరికి అభిమానులు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరికి పెళ్లై నేటికీ 15 ఏళ్లు గడించింది.
2009లో వీరిద్దరికి వివాహం జరిగింది. మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడలు వరుస అయిన విరానికనే విష్ణు భార్య అనే విషయం తెలిసిందే. వీరికి మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు.