- Home
- Entertainment
- పూరి జగన్నాధ్ ఆ మూవీని మక్కీకి మక్కీ కాపీ కొట్టారా.. నేను నోరు తెరిస్తే పెద్ద రచ్చ జరిగేది, క్రేజీ హీరో ఆవేదన
పూరి జగన్నాధ్ ఆ మూవీని మక్కీకి మక్కీ కాపీ కొట్టారా.. నేను నోరు తెరిస్తే పెద్ద రచ్చ జరిగేది, క్రేజీ హీరో ఆవేదన
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకులపై కాపీ ముద్ర పడుతూ ఉంటుంది. పూరి జగన్నాధ్ కూడా అందుకు అతీతం కాదు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకులపై కాపీ ముద్ర పడుతూ ఉంటుంది. పూరి జగన్నాధ్ కూడా అందుకు అతీతం కాదు. కానీ పూరి కెరీర్ లో సినిమాల పరంగా వివాదాలు చాలా తక్కువ.
తానే సొంతంగా కథలు రాసుకుని యువతకి నచ్చేలా దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. పూరి చిత్రాల్లో బలమైన కథ అంటూ ఏమి ఉండదు. ఆసక్తికరమైన పాయింట్ తీసుకుని దాని చుట్టూ కథ అల్లేస్తారు. అయితే పూరి జగన్నాధ్ కి కూడా కాపీ విమర్శలు ఎదురయ్యాయి.
ఆ విమర్శలు చేసింది ఎవరో కాదు.. ఆనందం లాంటి లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకున్న జై ఆకాష్ ఒక సందర్భంలో పూరి జగన్నాధ్ పై విమర్శలు చేశారు. పూరి జగన్నాధ్ కి ఇస్మార్ట్ శంకర్ చిత్రం కంబ్యాక్ మూవీ లాంటిది. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీనితో పూరి ఈ చిత్రానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు.
అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రం కాపీ అంటూ జై ఆకాష్ ఓ సందర్భంలో మీడియా ముందుకు వచ్చారు. తాను నటించిన 'కొత్తగా ఉన్నాడు' చిత్రానికి ఇస్మార్ట్ శంకర్ మూవీ మక్కీకి మక్కీ కాపీ అని ఆకాష్ ఆరోపిస్తున్నాడు. తాను ఇస్మార్ట్ శంకర్ సినిమా చూశానని ప్రతి సీన్ నా కథలోనిదే అని ఆకాష్ అంటున్నాడు.
Puri Jagannadh
కేవలం పూరి జగన్నాధ్ బ్యాక్ డ్రాప్ మాత్రమే మార్చారు. మిగతా మొత్తం అలాగే ఉంది. మీ కథ అయితే కోర్టుకి వెళ్ళాలి కదా.. మీడియాకి వచ్చి ఎందుకు రచ్చ చేస్తున్నారు అని యాంకర్ ప్రశ్నించగా.. నేను కోర్టుకి వెళితే ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రం అసలు ఉండేదే కాదు అని తెలిపాడు. రిలీజ్ కి ముందే నేను నోరు తెలిచి ఉంటే ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇంత పెద్ద హిట్ అయి ఉండేది కాదు అని అన్నారు.
కొత్తగా ఉన్నాడు చిత్రం తమిళంలో ఇస్మార్ట్ శంకర్ కంటే ముందే రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్న తరుణంలో పూరి జగన్నాధ్ ఇస్మార్ శంకర్ చిత్రం తెరకెక్కించారు. రిలీజ్ కి ముందే నాకు ఇస్మార్ట్ శంకర్ చిత్రం గురించి తెలిసి ఉంటే ఆపేసేవాడిని అని ఆకాష్ అంటున్నాడు.