మాజీ భార్యపై హీరో ధనుష్ సీక్రెట్ లవ్, లాల్ సలామ్ వల్ల బయటపడిందంటున్న నెటిజన్లు
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ విడిపోయి రెండేళ్లు అవుతోంది. రెండు కుటుంబాలు వీళ్ళను కలిపేప్రయత్నం ఎంత చేసినా.. లాభం లేకుండా పోయింది. అయితే తాజాగా లాల్ సలామ్ రిలీజ్ సందర్భంగా ఐశ్వర్యపై ధనుష్ కు ప్రేమ చిగురించినట్టు కనిపిస్తుంది.
Dhanush
ఈరోజు(9 పిబ్రవరి) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన లాల్ సలామ్ గురించి ధనుష్ ట్వీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. హీరో ధనుష్ 2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు లింగ, యాత్ర అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెళ్లయ్యాక భార్యను దర్శకురాలిగా తీర్చిదిద్దిన ధనుష్ తన మొదటి సినిమా 3లో హీరోగా నటించాడు. అంతే కాకుండా, అతను ఐశ్వర్య డైరెక్ట్ చేసిన సెకండ్ మూవీ వై రాజా వాయ్‌లో కొక్కి కుమార్‌గా అతిధి పాత్రలో కనిపించాడు.
Dhanush 51st movie
ఐశ్వర్యతో పెళ్లి తర్వాత ధనుష్ సినిమా కెరీర్ ఊపందుకుంది. రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ వంటి వాటిలో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇతర భాషల్లో గ్రాంగ్ గా అరంగేట్రం చేశాడు.
ధనుష్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ఐశ్వర్య.. 2022లో ధనుష్ కు విడాకులు ఇస్తున్నట్టు హఠాత్తుగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ధనుష్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె తరువాత ధనుష్ కూడా తన సోషల్ మీడియా పేజీలో కన్ ఫార్మ్ చేశాడు.
Rajinikanth and Dhanush
అయితే అందులో ఊరట ఏంటంటే..? కుటుంబ సభ్యులు జరిపిన చర్చలో ఇద్దరూ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాని కలిసి ఉండేది మాత్రం లేదన్నారు. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య విడిగా జీవిస్తున్నారు. ఐశ్వర్యతో విడిపోయినా కూడా తన మామ తమిళ సూపర్ స్టార్ రజనీపై ధనుష్ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. అందుకు కారణం ఆయన రజనీకి వీరాభిమాని కావడమే.
రజనీ సినిమాలను మిస్ అవ్వకుండా రెగ్యులర్‌గా చూసే ధనుష్ జైలర్ వరకు మిస్ అవ్వకుండా అన్ని సినిమాలు చూశాడు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలామ్ సినిమా పై పోస్ట్ పెట్టాడు. ఈసినిమా తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేయడం.. దానికి ధనుష్ కామెంట్ పెట్టడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.
నెటిజన్లు ఈపోస్ట్ పై డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ధనుష్ తన భార్య ఐశ్వర్యతో ప్రేమలో ఉన్నాడని. మళ్ళీ తన ప్రేమను రహస్యంగా వ్యక్తం చేస్తున్నాడని అంటున్నారు. మరి అది నిజం అయితే.. ఐశ్వర్యకూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక.. వీరు విడిగా ఉండాల్సిందేనా అనేది తెలియాల్సి ఉంది.