MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • చిరంజీవి రిజెక్ట్ చేస్తే మోహన్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు... విలన్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఏదో తెలుసా?

చిరంజీవి రిజెక్ట్ చేస్తే మోహన్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు... విలన్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఏదో తెలుసా?

చిరంజీవి రిజెక్ట్ చేసిన సబ్జెక్టు తో బ్లాక్ బస్టర్ కొట్టాడు మోహన్ బాబు. ఆ మూవీతో విలన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. మోహన్ బాబు కెరీర్ నే మార్చేసిన ఆ సినిమా ఏమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 17 2024, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎంత టాలెంట్ ఉన్నా.. మంచి సబ్జెక్ట్స్ ఎంచుకున్నప్పుడే కెరీర్ ఉంటుంది. దానితో పాటు అదృష్టం కూడా ఉండాలి. పేపర్ మీద అద్భుతంగా అనిపించే కథలు సిల్వర్ స్క్రీన్ పై తేలిపోవచ్చు. అలాగే స్క్రిప్ట్ దశలో సాదాసీదా అనిపించిన కథలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేయవచ్చు. అనుకోని కారణాలతో ఒకరు చేయాల్సిన మూవీ మరొకరి వద్దకు చేరొచ్చు. చిరంజీవి వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ఆయన చేయకపోవడంతో మోహన్ బాబు దశ తిరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Shiva Movie

Shiva Movie

మోహన్ బాబు కెరీర్ విలన్ గా మొదలైంది. బిగినింగ్ లో ఆయన కరుడుగట్టిన విలన్ రోల్స్ చేశాడు. అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రోల్స్ తో పాటు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించాడు. 90ల నాటికి హీరో కావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. 
 

38

దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడుగారు మూవీలో మోహన్ బాబు హీరోగా చేశాడు. అలాగే రౌడీ మొగుడు టైటిల్ తో మరొక చిత్రంలో హీరోగా నటించాడు. లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు ప్రతినాయకుడు పాత్రలు చేయడం ఆపలేదు. 

48
Mohan babu

Mohan babu

1991లో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ పడింది. అదే అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకుడు కాగా... ఆయన మొదట చిరంజీవితో ఈ మూవీ చేయాలని అనుకున్నారట. చిరంజీవికి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్స్ కారణం ఇప్పుడు చేయడం కుదరదు. సమయం పడుతుంది అన్నారట.

58
Mohan babu

Mohan babu

దాంతో బి.గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకుపోయాడు. మోహన్ బాబు ఓకే చేయడంతో మూవీ పట్టాలెక్కింది. అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దివ్యభారతిని హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఇది స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ హిట్ మూవీ వేలై కీడైచుడుచు చిత్రం ఆధారంగా తెరకెక్కించారు.

68

తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించాడు. మోహన్ బాబు ఇమేజ్ కి తగ్గట్లు, తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ బాగా ఫేమస్. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు అవతరించాడు. 
 

78
Mohan babu

Mohan babu

హీరోగా మోహన్ బాబు కెరీర్ కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది. అప్పటికి ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్ గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యాడు. 1995లో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

88
Mohan babu

Mohan babu


అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ చిరంజీవికి మిస్ అయినప్పటికీ... ఆయనకు గ్యాంగ్ లీడర్ రూపంలో ఇండస్ట్రీ హిట్ పడింది. 1991లోనే విడుదలైన గ్యాంగ్ లీడర్ అనేక రికార్డులు తుడిచిపెట్టింది. ఈ చిత్రానికి విజయ బాపినీడు దర్శకుడు. చిరంజీవి ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అది.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved