- Home
- Entertainment
- అల్లు అర్జున్, తారకరత్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయిన టాప్ డైరెక్టర్.. నో చెప్పిన బాలయ్య దర్శకులు
అల్లు అర్జున్, తారకరత్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయిన టాప్ డైరెక్టర్.. నో చెప్పిన బాలయ్య దర్శకులు
బెంగుళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ తారకరత్నని కాపాడలేకపోయారు. దీనితో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

అభిమానులు కలలో కూడా ఊహించని విధంగా నందమూరి తారకరత్న మరణించారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కుప్పంలోనే తారకరత్నకి చికిత్స జరిగింది. అప్పటికే ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారింది. ఆ తర్వాత ఆయన్ని బెంగుళూరు హృదయాలయ ఆసుపత్రికి తరలించారు
బెంగుళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ తారకరత్నని కాపాడలేకపోయారు.గత 20 రోజులుగా చావు బతుకుల మధ్య పోరాడుతున్న తారకరత్న నేడు శనివారం ప్రాణాలు విడిచారు. దీనితో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అకస్మాత్తుగా తారకరత్న కుప్పకూలడం, అంతలోనే పరిస్థితి విషమంగా మారడం, ఇప్పుడు ఆయన మరణ వార్త వినడం అంతా ఒక కలలా జరిగిపోయింది అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే తారకరత్న సినిమాలని, ఆయన జ్ఞాపకాలని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. తారకరత్న ఒక ఉప్పెనలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నందమూరి వారసుడు కావడంతో ఆయన తొలి చిత్రం గురించే అప్పటి ఉమ్మడి రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంది. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించింది. అయితే తారకరత్న తొలి చిత్రం ఒకటో నెంబర్ కుర్రాడు విషయంలో పెద్ద కసరత్తే జరిగింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన 100వ చిత్రానికి సన్నాహకాలు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలోని టాప్ హీరోతో 100వ చిత్రం చేయాలనేది ఆయన కోరిక. కానీ అదే సమయంలో తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ దర్శకేంద్రుడిని సంప్రదించారు. మీ వందవ చిత్రంగా నా కొడుకుని లాంచ్ చేయండి అని రిక్వస్ట్ చేశారు. ఇంతలో అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ ని లాంచ్ చేయమని బుజ్జగింపులు చేశారు. చాలా రోజులు చర్చలు జరిగాయి.
ఎటూ తేల్చుకోలేని సిట్యువేషన్ లో రాఘవేంద్ర రావు అల్లు అర్జున్ చిత్రానికే ఒకే చెప్పారు. మోహనకృష్ణ నొచ్చుకోకుండా.. తారకరత్న చిత్రానికి నేను సపోర్ట్ చేస్తా. మీ కొడుకుని తగ్గ కథని ప్రిపేర్ చేయిస్తా, సమర్పకుడిగా కూడా ఉంటా. దర్శకుడిని మాత్రం మీరు తెచ్చుకోండి అని చెప్పారు. దీనితో మోహనకృష్ణ తన సోదరుడు బాలయ్యని సలహా అడిగారట.
బి గోపాల్, సింగీతం శ్రీనివాసరావు లలో ఒకరిని ఎంచుకోవాలని సూచించారు. కానీ ఆ ఇద్దరు దర్శకులు వివిధ కారణాలు చెప్పి నో అన్నారు. దీనితో తిరిగి రాఘవేంద్ర రావుని సలహా అడగగా కోదండరామిరెడ్డిని సూచించారు. అలా ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది.