కన్నడ హీరోతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న రష్మిక... అతనికి బ్రేకప్ చెప్పిన కారణం ఇదే!
పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా మూవిలో హీరోయిన్ గా చేస్తున్న రష్మిక... మిషన్ మజ్ను మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందానపై లవ్, ఎఫైర్ రూమర్స్ తరచుగా వస్తూ ఉంటాయి.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఈజంట డిన్నర్ నైట్ కి జంటగా వెళుతూ కెమెరా కంటికి చిక్కారు.
అయితే కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమలో పడ్డ రష్మిక, పెళ్లి వరకు వెళ్లారు. కన్నడ చిత్రం కిరాక్ పార్టీ తో వెండితెరకు పరిచయమైంది రష్మిక. ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపింది అమ్మడు.
2017 జులై 3న రక్షిత్, రష్మిక ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. మరికొద్దిరోజులలో పెళ్లి అనగా.. రష్మిక, రక్షిత్ విడిపోవడం జరిగింది. దీనితో వీరు పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు.
ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ కి కారణం ఏమిటని ఫ్యాన్స్ ఎప్పటి నుండో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. రష్మిక ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు.
అయితే రష్మిక తల్లి సుమన్ మందాన మాత్రం ఓ సందర్భంలో.. కెరీర్ కోసం పరస్పర అవగాహనతో వారు విడిపోయారని వివరణ ఇచ్చారు.
ఇక రక్షిత్ శెట్టి చాలా కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. రక్షిత్ కి బ్రేకప్ చెప్పిన కారణంగా రష్మిక సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యారు. దీనితో రక్షిత్ సోషల్ మీడియా ద్వారా రష్మికను ఎవరూ ఏమి అనకండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఆమెను జడ్జ్ చేయడం ఆపండి అంటూ కోరుకున్నారు.
అయితే రష్మిక, రక్షిత్ విడిపోవడానికి అసలు కారణం మాత్రం ప్రామిస్ బ్రేక్ చేయడమే అని తెలుస్తుంది. పెళ్లి తరువాత సినిమాలు చేయకూడదు అనేది రక్షిత్ నిబంధన కాగా, కెరీర్ ఊపందుకుంటున్న దశలో దానికి ఒప్పుకోలేక రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేశారట.
ఒక విధంగా రష్మిక నిర్ణయం ఆమెకు మంచే చేసింది. 2017లో పెళ్లి చేసుకొని సినిమాలు మానేస్తే.. ఇప్పుడు కోట్ల సంపాదన, స్టార్ హీరోయిన్ హోదా, ఫేమ్ అన్నీ కోల్పోయేది.