MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రేకింగ్: సమంత తండ్రి హఠాన్మరణం!

బ్రేకింగ్: సమంత తండ్రి హఠాన్మరణం!

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్మరణం పొందారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆమె ఒక ఎమోషనల్ నోట్ అభిమానులతో పంచుకున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 29 2024, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠన్మరణం పొందారు. ''మళ్ళీ మనం కలిసే వరకు నాన్న'' అని కామెంట్ పెట్టిన సమంత , హార్ట్ బ్రేక్ ఎమోజీ జోడించారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
SAMANTHA

SAMANTHA

జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నిద్రలో ఆయన హార్ట్ అటాక్ కి గురయ్యారట, అదే ఆయన మరణానికి కారణం అని ప్రాథమిక సమాచారం.  సమంత తండ్రి జోసెఫ్ భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో విషాదం నింపింది. ఈ ఘటన సమంతను తీవ్ర వేదనలో నింపింది. తాను కెరీర్లో ఎదగడం వెనుక తండ్రి జోసెఫ్ కృషి ఎంతగానో ఉందని సమంత పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. 

36

ఇటీవల సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత తండ్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడూ సమంత జీవితాన్ని ఛాలెంజింగ్ గా మలిచేవారట. నువ్వు చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్స్ మాత్రమే అవి. నువ్వు స్మార్ట్, ఇంటెలిజెంట్ అని ఎప్పుడూ భావించకు అనేవారట. తనకున్న సామర్ధ్యాలను ఆయన దాచే ప్రయత్నం చేసేవారట.  

 

 

46

జోసెఫ్, నినెట్టే దంపతులకు సమంత 1987లో జన్మించారు. జోసెఫ్ ఆంగ్లో ఇండియన్ అని సమాచారం. సమంత కంటే ముందు ఇద్దరు అబ్బాయిలు జోసెఫ్ కి సంతానంగా ఉన్నారు. చెన్నై కి సమీపంలో గల పల్లవరం లో వీరు గతంలో నివసించేవారని తెలుస్తుంది. కాగా గత మూడేళ్ళలో సమంత జీవితంలో అనేక విషాదాలు చోటు చేసుకున్నాయి. భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత డిప్రెషన్ కి గురైంది. 

56

విడాకుల వేదన నుండి బయటకు పడే లోపు.. మరో సమస్యలో ఆమె చిక్కుకున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడిన సమంత రెండేళ్లకు పైగా చికిత్స తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్ లో తనకు మయోసైటిస్ సోకినట్లు సమంత వెల్లడించారు.

66

తండ్రి మరణం ఆమె జీవితంలో అతి పెద్ద కుదుపు. ఇక సమంత తండ్రి మరణవార్త తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు, సంతాపం ప్రకటిస్తున్నారు. సమంత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Cannes: రాకుమారిలా అలియా భట్.. గ్రీన్ గౌను వేసుకుని కేన్స్‌లో మెరుపులు..
Recommended image2
Biggest Flop Movie: రూ.1400 కోట్లు పెట్టి తీస్తే, వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్
Recommended image3
Seerat Kapoor: నువ్వు అల్లు అర్జున్ ప్రాపర్టీ.. అన్న నెటిజన్, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved