`హరిహర వీరమల్లు` ఆ రిలీజ్ డేట్లు అంతా తూచ్.. విడుదలపై టీమ్ క్లారిటీ ఇదే
`హరిహర వీరమల్లు` మూవీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా టీమ్ స్పందించింది. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది.

`హరిహర వీరమల్లు` రిలీజ్ డేట్‌పై రూమర్లు
`హరిహర వీరమల్లు` సినిమాపై రోజుకో వార్త వినిపిస్తుంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల కాలంలోనే రెండు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది. ఇదే అదనుగా భావించి గాసిప్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. తమకు తోచిన రిలీజ్ డేట్‌ని ప్రచారం చేస్తున్నారు.
`హరిహర వీరమల్లు` రిలీజ్ రూమర్లపై టీమ్ క్లారిటీ
జూన్ చివరి వారంలో అని, జులై మొదటి వారం అని, రెండో వారం అని, చివరి వారం అంటూ రకరకాల డేట్లు ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటిఊహాగానాలతో కూడిన రిలీజ్ డేట్లు పోస్ట్ చేస్తూ కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా పలు మార్లు వాయిదా పడుతూ వస్తోన్న నేపథ్యంలో అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. దీనికితోడు ఇలాంటి కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేసే రిలీజ్ డేట్లు ప్రచారం అవుతున్న నేపథ్యంలో టీమ్ స్పందించింది. క్లారిటీ ఇచ్చింది.
రిలీజ్‌పై రూమర్లని నమ్మొద్దంటూ టీమ్ పోస్ట్
`హరిహర వీరమల్లు` సినిమా విడుదల తేదీపై రూమర్లని ఖండించింది టీమ్. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న రిలీజ్ డేట్లు నిజమైనవి కావు, వాటిని ఎవరూ నమ్మొద్దు అని స్పష్టం చేసింది. ఇలాంటి మిస్ లీడింగ్ డేట్‌లను ప్రచారం చేయోద్దని,
అదే సమయంలో రిలీజ్ డేట్‌ని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని, తమ అధికారిక సోషల్ మీడియా ఛానెల్ ద్వారా వచ్చే రిలీజ్ డేట్‌నే నమ్మాలని, అప్పటి వరకు ఓపికగా ఉండాలని, ఇప్పటి వరకు అందిస్తున్న ప్రేమని, సహకారాన్ని కొనసాగించాలని టీమ్ వెల్లడించింది.
Kindly ignore all release dates currently circulating online. The new official release date will be announced in a few days through our official channels. We request your continued love and support until then. 🦅🏹#HariHaraVeeraMallu#HHVM#DharmaBattlepic.twitter.com/4NsKq4aG3u
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 9, 2025
`హరిహర వీరమల్లు` టీమ్ ఇదే
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న `హరిహర వీరమల్లు` సినిమాకి జ్యోతికృష్ణ దర్శకుడు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో జ్యోతికృష్ణ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు అనే విషయం తెలిసిందే. ఇందులో బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేస్తుండగా, పవన్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
కత్తికి, ధర్మానికి మధ్య పోరాటం
హిస్టారికల్ యాక్షన్ మూవీగా `హరిహర వీరమల్లు` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కత్తికి ధర్మానికి మధ్య యుద్ధమే ఈ చిత్రం అని అటు పవన్ కళ్యాణ్, ఇటు దర్శకుడు జ్యోతికృష్ణ తెలిపారు. అమాయక ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన ఔరంగ జేబ్‌పై వీరమల్లు పోరాటమే ఈ మూవీ అని తెలుస్తుంది.
ఇందులో వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఔరంగ జేబ్‌గా బాబీ డియోల్ కనిపించబోతున్నారు. పవన్ మొదటిసారి ఇలాంటి హిస్టారికల్ మూవీస్ లో నటిస్తున్నారు. ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక ఈ చిత్రం జులైలో విడులయ్యే అవకాశాలున్నాయి.