MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ 'డబుల్ ఇస్మార్ట్' ..సీన్ లోకి 'హనుమాన్' ప్రొడ్యూసర్ ?!!

రామ్ 'డబుల్ ఇస్మార్ట్' ..సీన్ లోకి 'హనుమాన్' ప్రొడ్యూసర్ ?!!

  'కిరాక్ పొరొస్తే సైట్ మార్..ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ప మార్.. నాక్ తెల్వకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గు..కాలుతది.

3 Min read
Author : Surya Prakash
Published : Jul 09 2024, 06:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Double iSmart

Double iSmart


 రామ్ పోతినేని(Ram Pothineni) నుండి వస్తున్నప్రతిష్టాత్మక చిత్రం  డబల్ ఇస్మార్ట్(Double Ismart) పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగులో డైనమిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dut)విలన్గా  చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్, సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. సాంగ్ జనాల్లోకి వెళ్లిపోయింది. టీజర్ కూడా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.  పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చారని, ఆయన  మార్క్ లెవల్లో డైలాగ్స్ అదిరిపోయి అంటున్నారు. దిమాక్ కిరి కిరి.. అంటూ  తన మార్క్ డైలాగ్స్ తో  రెచ్చిపోయాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే బిజినెస్ ఇంకా క్లోజ్ చేయలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Ram Pothineni Double ISMART

Ram Pothineni Double ISMART


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం థియేటర్ రైట్స్ కు బేర సారాలు జరుగుతున్నాయి. పూరి, ఛార్మి ప్లాన్ ఏమిటంటే ఈ సినిమాని సింగిల్ బయ్యరు కు ఇవ్వాలని. ఎందుకంటే లైగర్ తో వాళ్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పటికి ఆ తలనొప్పి ఇంకా తీరలేదు. ఇప్పటికీ లైగర్ సెటిల్మెంట్స్ కోసం రచ్చ అప్పుడప్పుడూ జరుగుతోంది. ఈ నేపధ్యంలో సింగిల్ బయ్యరు అయితే ఆ ఒక్కరికే సమాధానం చెప్తే సరిపోతుందని భావిస్తున్నారు.

39


ఈ క్రమంలో డబల్ ఇస్మార్ట్(Double Ismart) థియేటర్ రైట్స్ కు ఓ రేటు ఫిక్స్ చేసారు. తెలుసుకున్న సమాచారం మేరకు 63 కోట్లు అడుగుతున్నారట. అయితే సురేష్ బాబు, ఏషియన్ సునీల్ ...కలిసి 36 కోట్లుకు ఇవ్వమని ప్రపోజల్ పెట్టారట. అయితే తమకు నార్త్ ఇండియా రైట్స్ అక్కర్లేదని కేవలం తెలుగు రెండు రాష్ట్రాల రైట్స్ ఆ రేటుకు ఇవ్వమని కోట్ చేసారట. అయితే లైగర్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని 63 కోట్లు అనేసరికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.

49


కానీ హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మాత్రం 45 కోట్లకు థియేటర్ రైట్స్ ఇవ్వమని అడుగుతున్నారని సమాచారం. ఆయనతోనే టాక్స్ జరుగుతున్నాయని, ఇంకా ఏమీ ఫైనలైజ్ కాలేదు కానీ, మాగ్జిమం నిరంజన్ రెడ్డికే ఓ రైటుకు ఫైనల్ చేసి సింగిల్ బయ్యర్ గా ఈ చిత్రం రైట్స్ ఇస్తారని చెప్పుకుంటున్నారు. నిరంజన రెడ్డి కూడా 50 కోట్లు దాకా వెళ్దామని ఫిక్స్ అయ్యినట్లు చెప్తున్నారు. 

59


ఇక ఈ చిత్రం నాన్ థియేటర్ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. హిందీ శాటిలైట్ రైట్స్, ఓటిటి రైట్స్ నుంచి భారీ మొత్తం రానుంది. ఆ టాక్స్ కూడా జరుగుతున్నాయి. అమేజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ ఈ రెండింటిలో ఒకదానికి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇచ్చేసారని తెలుస్తోంది. మంచి లాభానికే పూరి ఈ సినిమా తో బయిటపడనున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 

69


ఏదైమైనా  'కిరాక్ పొరొస్తే సైట్ మార్..ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ప మార్.. నాక్ తెల్వకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గు..కాలుతది..ఒక్కొక్కని మొలకి లడీ కడ్తా..గ్రానెట్ గుచ్చి పిన్ను పిక్తా..అంటూ రామ్ మాస్ ని చూపించాడు పూరీ..  ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది ఈ నేపధ్యంలో బడ్జెట్ గురించి హాట్ టాపిక్ గా మారింది.  

79


ఈ  సినిమా కన్నా ముందు పూరీ జగన్నాథ్ మరియు రామ్ లు ఇద్దరికీ కూడా ఫ్లాఫ్స్  రావటంతో  ఆ ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ పై పడుతుంది అనుకున్నారు.  ఈ సారి భారీ బడ్జెట్ తో సీక్వెల్ రూపొందుతుంది అని తెలుస్తోంది…ఆల్ మోస్ట్ సినిమా కోసం ఇప్పుడు 65-70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని వినిపిస్తోందిన, స్టార్ కాస్ట్ కి రెమ్యునరేషన్ ల కింద ఎక్కువ అమౌంట్ వెళ్ళింది అంటున్నారు.  అయితే  నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుకి అమ్మబోతున్నారు కాబట్టి నో ప్లాబ్లం అంటన్నారు.  
 

89


డబుల్ ఇస్మార్ట్ సినిమాతో హిట్ కొట్టాలని పూరి జగన్నాథ్-రామ్ కసిగా ఉన్నారు. ఇంట్రెస్టింగ్‌గా వీరిద్దరి లాస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌యే కావడం విశేషం.  రామ్ చివరిగా స్కంద సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. గత ఏడాది రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అనుకున్నతంగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు పూరి జగన్నాథ్ చివరిగా లైగర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించారు. విజయ్ దేవరకొండతో చేసిన ఈ సినిమాతో ఫ్లాప్ అయింది.
 

99


'పూరి కనెక్ట్స్' బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.  ఈ సారి ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.    పూరీ ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ తీశాడని..ఈ సీన్‌ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెట్టాడని టాక్ వినిపించింది. ఆలీ,  షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌కపాత్ర‌లు పోషిస్తున్నారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image2
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image3
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved