- Home
- Entertainment
- రవితేజ, గోపీచంద్ మలినేని మూవీ స్టోరీ లీక్.. దేశాన్ని కుదిపేసిన హత్యాకాండ, చాలా పెద్ద రిస్క్
రవితేజ, గోపీచంద్ మలినేని మూవీ స్టోరీ లీక్.. దేశాన్ని కుదిపేసిన హత్యాకాండ, చాలా పెద్ద రిస్క్
మాస్ మహారాజ్ రవితేజ జోరు తగ్గడం లేదు. వరుస ప్రాజెక్ట్స్ ని ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వర రావు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ చిత్రాన్ని రవితేజ అనౌన్స్ చేశారు.

మాస్ మహారాజ్ రవితేజ జోరు తగ్గడం లేదు. వరుస ప్రాజెక్ట్స్ ని ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వర రావు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ చిత్రాన్ని రవితేజ అనౌన్స్ చేశారు. గోపీచంద్ మలినేని, రవితేజ హ్యాట్రిక్ కాంబినేషన్ లో చిత్రానికి ప్రకటన ఇటీవల వచ్చింది.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో గతంలో బలుపు, క్రాక్, డాన్ శీను లాంటి మాస్ హిట్స్ తెరకెక్కాయి. ఇప్పుడు ఈ నాల్గవ చిత్రంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇలా ప్రకటించారో లేదో అప్పుడే కథపై లీకులు మొదలయ్యాయి. క్రాక్ చిత్రాన్ని గోపీచంద్ మలినేని ఒంగోలు, కఠారి కృష్ణ నేపథ్యంలో తెరకెక్కించారు.
ఈ తాజా చిత్రానికి కూడా గోపీచంద్ మలినేని యదార్థ సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్, వీడియోలో దీనికి సంబంధిచిన హింట్ కూడా ఇచ్చారు. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో చుండూరు గ్రామం ఒక భాగం. చుండూరు పేరు చెప్పగానే 1991లో జరిగిన దళితుల ఊచకోత గుర్తుకు వస్తుంది.
చుండూరులో దాదాపు 300 మంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దళితవాడపై విచక్షణారహితంగా వేటకొడవళ్లతో దాడికి తెగబడ్డారు. 1991 ఆగష్టు 6న జరిగిన ఈ సంఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 8 మంది దళితులు హత్య చేయబడ్డారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. కొందరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేశారని, కొందరిని మల్లెతోటలో హత్య చేసి అక్కడే పాతిపెట్టారని ఈ సంఘటన గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.
16 ఏళ్ల విచారణ తర్వాత కోర్టు నిందితులకు ఈ కేసులో శిక్ష విధించింది. గోపీచంద్ మలినేని ఈ చుండూరు సంఘటననే రవితేజ చిత్రంతో టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఈ ఊరి పేరు కూడా చూడవచ్చు. ఊరు తగలబడిపోతున్న దృశ్యాలని ఈ వీడియోలో చూపిస్తూ సినిమా థీమ్ గురించి హింట్ ఇచ్చారు.
దళితుల ఊచకోత నేపథ్యంలో చిత్రం అంటే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ కార్షియల్ చిత్రానికి బాగా ప్లస్ అవుతుంది కానీ కొంచెం తేడా జరిగినా కాంట్రవర్సీ రచ్చ రచ్చగా మారుతుంది. మరి గోపీచంద్ మలినేని ఎలా డీల్ చేస్తారో చూడాలి. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.