MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఓటీటీలోకి వచ్చేసిన రాజు యాదవ్.. గెటప్ శ్రీను చిత్రానికి క్రేజీ రెస్పాన్స్

ఓటీటీలోకి వచ్చేసిన రాజు యాదవ్.. గెటప్ శ్రీను చిత్రానికి క్రేజీ రెస్పాన్స్

ఎప్పుడు నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ సంఘటనల ఆధారంగా తెరికెక్కిన చిత్రం ‘రాజు యాదవ్’.ప్రస్తుతం ఈ చిత్రం ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 25 2024, 10:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Raju Yadav

Raju Yadav

ఎప్పుడు నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ సంఘటనల ఆధారంగా తెరికెక్కిన చిత్రం ‘రాజు యాదవ్’.
తమిళం, మలయాళం సినిమాలలో కనిపించేటువంటి సహజత్వంతో కూడుకున్న సన్నివేశాలతో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ సినిమాటిక్ పోకడలకి వెళ్ళకుండా చాలా రియలిస్టిక్ గా రూపొందించబడింది.ప్రస్తుతం ఈ చిత్రం ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Raju Yadav

Raju Yadav

ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా, ప్రేమ పేరుతో వెంటపడే కొద్దిమంది ప్రేమికుల గురించి తరచూ వింటూనే ఉంటాం, కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై అఘాయిత్యాలకి పాల్పడటం, మరికొన్నిసార్లు దేవదాసులుగా మారిపోవడం లాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అలాంటి అపరిపక్వమైన ఆలోచనలున్న ఓ యువకుడి ప్రేమకథగా రూపొందించిన చిత్రం.

34

 ప్రథమార్థం సినిమా అంతా కూడా కథానాయకుడు, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయుకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది. ధ్వితీయార్థం లోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తుంది.
 

44

గెటప్ శ్రీను నటన చిత్రానికి ప్రధానబలం. ఫేస్ మీద ఎప్పుడు నవ్వుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. ప్రథమార్థంలో నవ్వు మొహంతో కనిపిస్తూ నవ్వించిన ఆయన, ధ్వితీయార్థంలో నవ్వుతూనే భావోద్వేగాలని పండించాడు. దర్శకుడు కృష్ణమాచారి ఒక రియల్ స్టోరీని తీసుకొని, అంతే రియలిస్టిక్ గా చూపించాడు. సినిమాలో చివరి 20 నిమిషాలు వచ్చే సన్నివేశాల్ని, ఎమోషన్ ని మలిచిన తీరుకి దర్శకుడిని తప్పకుండా అభినందిచాల్సిందే. ఆహా ఓటిటిలో జూలై 24న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. గెటప్ శ్రీను పెర్ఫామెన్స్ ని అంతా ప్రశంసిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved