- Home
- Entertainment
- Genelia Deshmukh ReEntry : గుడ్ న్యూస్ చెప్పిన జెనీలియా.. ఆ మూవీతోనే సౌత్ కు రీఎంట్రీ ఇవ్వబోతోందట..
Genelia Deshmukh ReEntry : గుడ్ న్యూస్ చెప్పిన జెనీలియా.. ఆ మూవీతోనే సౌత్ కు రీఎంట్రీ ఇవ్వబోతోందట..
హీరోయిన్ జెనీలియా తెలుగు ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. పదేండ్ల తర్వాత సౌత్ సినిమాకు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వెల్లడించింది. తను నటించబోతున్న మూవీ వివరాలను తెలిపింది. దీంతో తెరపై జెనీలియా అల్లరిని మళ్లీ చూసే రోజులు వచ్చాయంటూ నెటిజన్లు సంతోషపడుతున్నారు.

హీరో సుమంత్ నటించిన ‘సత్యం’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యిందీ హీరోయిన్ జెనీలియా దేశ్ ముఖ్ (Genelia Deshmukh). ఈ చిత్రం మంచి సక్సెస్ ను సాధించడంతో ఈమెకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
దీంతో సాంబ, సై, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, మిస్టర్ మేధావి, రెడీ, ఆరెంజ్, నా ఇష్టం వంటి చిత్రాల్లో నటించింది. జెనీలియా నటించిన చిత్రాల్లో సత్యం, సై, సుభాష్ చంద్రబోస్, బొమ్మరిల్లు, ఢీ, రెడీ చిత్రాలు బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో సౌత్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
2012లో రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోగా నటించిన ‘నా ఇస్టం’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో సౌత్ ఫిల్మ్ కు గుడ్ బాయ్ చెప్పింది. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ ‘రితీష్ దేశ్ ముఖ్’ను 2013లో పెండ్లి చేసుకుంది. రితీష్, జెనీలియా 2003లో ‘తుజే మేరీ కసమ్’ మూవీలో నటించారు. ఇది జెనిలియాకు హిందీలో మొదటి చిత్రం.
ఈ మూవీతోనే గ్లామర్ ఫీల్డ్ కు ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పటి నుంచే ప్రేమలో ఉన్న వీరు పెండ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెండ్లి తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా జెనీలియా.. హిందీ, మరాఠి చిత్రాల్లో నటిస్తూనే వస్తుంది. ఇక తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉంటుందో.. లేదో అనే భావనలో ఉన్న ఆడియెన్స్ కు తాజాగా గుడ్ న్యూస్ చెసింది.
సౌత్ సినిమాకు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వెల్లడించింది. మెనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి (Gali Janardhan Reddy) తనయుడు కిరీటి (Kireeti) హీరోగా ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే జెనీలియా సౌత్ కు రీఎంట్రీ ఇవ్వనున్నట్టుు తెలుస్తోంది. ఈ మేరకు కిరీటీ మూవీ మేకర్స్ కు ఆల్ ద బెస్ట్ తెలిపింది.
‘ఇక ఈరోజు దక్షిణాది సినిమాల్లోకి నా రీ ఎంట్రీని సూచిస్తోంది. నా ఇంటిగా భావించే ఇంటికి దూరంగా ఉన్నాను. నన్ను గుర్తుంచుకొని మరీ ప్రత్యేకంగా భాగస్వామిని చేసినందుకు సాయి కొర్రపాటి, రాధాకృష్ణ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. డెబ్యూ ఫిల్మ్ సందర్భంగా కిరీటీకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ తొలి చిత్రంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను’ అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా ఎదిగిన సాయి కొర్రపాటి తన వారాహి సంస్థ ద్వారా గాలి కిరీటిని హీరోగా పరిచయం చేస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నడ నాట సూపర్ హిట్ అయిన మాయాబజార్ సినిమాను డైరెక్ట్ చేసిన యంగ్అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఈమూవీని తెరకెక్కించబోతున్నారు. తాజాగా హీరో కిరీటి ఇంట్రడ్యూస్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కిరీటి ఈ వీడియో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.