టైగర్ నాగేశ్వరరావులో నాటు అందంతో నటించా, 60 మందిని దాటుకుని వచ్చా..ఢిల్లీ బ్యూటీ గాయత్రీ బ్యూటిఫుల్ బ్లాస్ట్
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 20న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న గాయత్రీ భరద్వాజ్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె జోరు మామూలుగా లేదు.
కళ్ళు చెదిరే హాట్ స్ట్రక్చర్ తో అందాలు ఒలకబోస్తోంది. క్యాజువల్ డ్రెస్సుల్లో సైతం గ్లామర్ ఒలికిస్తుండడంతో యువత గాయత్రీ జపం చేస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో గాయత్రీ టైగర్ నాగేశ్వర రావు చిత్రం గురించి అనేక విశేషాలు తెలిపింది.
టైగర్ నాగేశ్వర రావు కన్నా ముందు తనకి ఒక తెలుగు చిత్రంలో అవకాశం వచ్చింది అని పేర్కొంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రంలో తాను నటించలేకపోయానని పేర్కొంది.
ఏది ఏమైనా చివరకు రవితేజ గారి సరసన ఇంత పెద్ద పాన్ ఇండియా చిత్రంలో నటించే ఛాన్స్ రావడం మాత్రం తన అదృష్టం అని పేర్కొంది. అయితే ఆఫర్ మాత్రం ఈజీగా వచ్చేయలేదు. దాదాపు నాతో పాటు 60 అమ్మాయిలు ఈ చిత్రం కోసం ఆడిషన్స్ లో పాల్గొన్నారు.
అందరూ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. కానీ చివరికి అవకాశం నాకే దక్కింది అని గాయత్రీ భరద్వాజ్ పేర్కొంది.ఈ చిత్రంలో తనకి రియల్ లైఫ్ లో ఏమాత్రం సంబంధం లేని పల్లెటూరి అమ్మాయిగా నటించా.
అందులోనే నాకు ఛాలెంజ్ అనిపించింది. మనకు సంబంధం లేని పాత్రలో నటించి మెప్పిస్తే ఆ కిక్కే వేరు అని గాయత్రీ పేర్కొంది. ఈ చిత్రంలో నాటు అందంతో కనిపిస్తాను.
తాను రాంచరణ్ అభిమానిని అని గాయత్రీ భరద్వాజ్ పేర్కొంది. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించాక మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు గాయత్రీ పేర్కొంది.