MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్క అందంపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ఇంకా వదలడం లేదుగా..

అనుష్క అందంపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ఇంకా వదలడం లేదుగా..

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన చిరంజీవి, గరికపాటి నరసింహా రావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 12 2022, 08:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన చిరంజీవి, గరికపాటి నరసింహా రావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారి తీశాయి. మెగా అభిమానులు గరికపాటి తీరుని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

చిరంజీవి రావడంతో అక్కడున్న అభిమానులు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. దీనితో ప్రవచనం చెబుతున్న గరికపాటికి అసహనం కలిగింది. చిరంజీవిగారు వెంటనే ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపు రావాలి. లేకుంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతారు. నాకు ఎలాంటి మొహమాటం లేదు. చిరంజీవి ఫోటో షూట్ ఆపేయండి లేదా నాకు సెలవు ఇప్పించండి అంటూ మాట్లాడారు. 

36

ప్రవచనాలు చెప్పే గరికపాటికి ఆ మాత్రం ఓపిక, సహనం లేకపోవడం ఏంటి అంటూ చిరంజీవి అభిమానులు విమర్శించారు. చిరంజీవి లాంటి వారు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది. దానిని నిర్వాహకులు చక్కదిద్దాలి లేదా ఓపికగా ఉండాలి అంటూ గరికపాటికి చురకలు అంటించారు. 

 

46

ఈ వివాదంలో గరికపాటి తీరుని వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా తప్పుబట్టారు. గరికపాటిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఆర్జీవీ వరుస పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా వర్మ.. గరికపాటి నరసింహారావుపై మరో సెటైరికల్ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ లో గరికపాటి గతంలో అనుష్క అందం గురించి కొంటెగా చెబుతున్న వీడియో జత చేసారు. 

56

ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. ఒక మంచి స్టిల్ లో అనుష్క ఫోటో పేపర్ లో ఉంది. మా అబ్బాయితో పాటు నేను కూడా చూస్తూ ఉండిపోయా అంటూ గరికపాటి కొంటెగా అనుష్క అందం గురించి ప్రస్తావించారు. 

 

66

మా అబ్బాయి నా కాళ్లదగ్గర కూర్చున్నాడు. నేను కాళ్ళకి నమస్కరిస్తాడేమో అనుకున్నా. కానీ అనుష్క ఫోటో చూస్తున్నాడు అంటూ గరికపాటి సరదాగా చేసిన వ్యాఖ్యలపై వర్మ సెటైర్లు వేశారు.. ఆహా ఓహో అంటూ వర్మ ట్వీట్ చేయడం విశేషం. గతంలో గరికపాటి చెప్పిన పలు విషయాల్ని వర్మ ట్వీట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved