తుళ్లిపడుతున్న చేప పిల్లలా 'గద్దలకొండ గణేష్' బ్యూటీ.. హృదయాలు దోచేస్తున్న టిక్ టాక్ బేబీ అందాలు
తమిళ పిల్ల మృణాళిని రవి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయం. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చిత్రంలో నటించింది.
తమిళ పిల్ల మృణాళిని రవి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయం. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చిత్రంలో నటించింది. మృణాళిని తెలుగులో నటించిన ఏకైక చిత్రం ఇదే.
ఈ మూవీలో భలే క్యూట్ గా నటించి మెప్పించింది. మృణాళిని రవి టిక్ టాక్ డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది. అద్భుతంగా హావభావాలు పండిస్తూ మృణాళిని చేసిన వీడియోలకు కుర్రకారు వెర్రెత్తిపోయారు.
దీనితో సోషల్ మీడియాలో స్టార్ గా అవతరించింది మృణాళిని. టిక్ టాక్ వీడియోలతో యువతలో బాగా క్రేజ్ పెంచుకుంది. ఇక గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వచ్చాయి.
అలా హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో మృణాళిని పాత్ర పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కాదు. కానీ గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రే.
పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. ట్రెండీ డ్రెస్సులు, అందమైన చీరల్లో అందాలు ఒలకబోస్తోంది.
నడుము సొగసు చూపుతూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ఆమె నాజూకైన అందాలకు ఎవరైనా ఫిదా అవుతారు. తాజాగా మృణాళిని చీర, జీన్స్ ఇలా వివిధ డ్రెస్సుల్లో తుళ్లిపడుతున్న చేపపిల్లలా ఫోజులు ఇచ్చింది.
సముద్ర తీరాన అలలతో ఆడుకుంటూ ఆమె ఇచ్చిన ఫోజులు అదుర్స్. అలాగే జీన్స్ ప్యాంట్ లో ట్రెండీగా కేక పెట్టించే విధంగా ఉంది.