MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Charan-Upasana: ఫస్ట్ టైం బేబీ బంప్ రివీల్ చేసిన చరణ్ వైఫ్ ఉపాసన... ఆ అపోహలకు చెక్ పెట్టిందిగా!

Charan-Upasana: ఫస్ట్ టైం బేబీ బంప్ రివీల్ చేసిన చరణ్ వైఫ్ ఉపాసన... ఆ అపోహలకు చెక్ పెట్టిందిగా!

చరణ్ వైఫ్ ఉపాసన ఫస్ట్ టైం తన బేబీ బంప్ రివీల్ చేశారు. ఆ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లకు చెక్ పెట్టారు.  

2 Min read
Sambi Reddy
Published : Dec 20 2022, 09:57 AM IST| Updated : Dec 20 2022, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ram Charan

Ram Charan

ఏళ్ల తరబడి సాగిన మెగా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వారు ఎదురుచూసిన శుభతరుణం వచ్చింది. రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త చిరంజీవి(Chiranjeevi) అభిమానులతో పంచుకున్నారు. ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 
 

27
Ram Charan Upasana

Ram Charan Upasana

చిత్ర పరిశ్రమలో వారసత్వం ఉంటుంది. ఒక స్టార్ హీరో అభిమానులు ఆయన వారసుడు రావాలి, లెగసీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన చరణ్  చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించాడు. ఆయన పేరు నిలబెట్టాడు. అలాగే చరణ్ వారసుడిని దించాలి, భవిష్యత్ లో అతడు కూడా స్టార్ కావాలని కోరుకుంటున్నారు.

37


ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా, సమాజం పోకడ ఇదే. పెళ్ళై పదేళ్లు దాటినా చరణ్(Ram Charan)దంపతులు పిల్లల్ని కనకపోవడం మెగా అభిమానుల్లో అతిపెద్ద ఆందోళనకు కారణమైంది. ఒక దశలో వారు ఆశలు కూడా వదులుకున్నాడు. ఇక చరణ్ తండ్రికారేమో అని ఆలోచనలో పడ్డారు. 

47

ఉపాసన(Upasana)తల్లి అయ్యారన్న వార్త వారి ఆందోళనలు, అనుమానాలు పటాపంచలు చేసింది. ఎక్కడలేని సంతోషం తెచ్చిపెట్టింది. కాగా ఉపాసన దంపతులు థాయిలాండ్ టూర్ కి వెళ్లారు. ఉపాసన కుటుంబ సభ్యులతో పాటు చరణ్ ఈ వెకేషన్ లో పాల్గొన్నారు. రామ్ చరణ్-ఉపాసనల థాయిలాండ్ వెకేషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

57
Ram Charan

Ram Charan

సదరు ఫొటోల్లో ఉపాసన బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది. రెడ్ లాంగ్ ట్రెండీ వేర్ లో ఉపాసన ఫోటోలకు ఫోజిచ్చారు. ఆ డ్రస్ కొంచెం టైట్ గా ఉంది. ఈ క్రమంలో ఉపాసన బేబీ బంప్ రివీల్ అవుతుంది. ప్రేగ్నన్సి ప్రకటించాక ఫస్ట్ టైం ఉపాసన తన బేబీ బంప్ రివీల్ చేయడం జరిగింది. దీంతో ఉపాసన ఒక పుకారుకు చెక్ పెట్టారు.

67

ఉపాసన గర్భం దాల్చలేదు. చరణ్ దంపతుల బిడ్డ వేరే మహిళ గర్భంలో పెరుగుతుంది. వారు సరోగసీ పద్దతిలో పేరెంట్స్ అవుతున్నారంటూ కొన్ని నిరాదరణ కథనాలు తెరపైకి వచ్చాయి. ఈ పుకార్లకు ఉపాసన తాజా ఫోటో స్పష్టత ఇచ్చింది. రామ్ చరణ్ దంపతులు సరొగసీ ఆశ్రయించలేదన్న విషయం నిర్ధారణ అయ్యింది.

77


మరోవైపు రామ్ చరణ్ దర్శకుడు శంకర్ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ ప్రాజెక్టు అనంతరం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మూవీ చేయనున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Recommended image2
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Recommended image3
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved